న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌.. ఓడినా నవ్వుతూనే ఉన్నారు (వీడియో)!!

Thai greeting: Thailand players win hearts at Women’s T20 World Cup debut

పెర్త్‌: రెండు రోజుల క్రితం ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ ప్రాంరంభం అయిన విషయం తెలిసిందే. ఈ ప్రపంచకప్‌లో పసికూన థాయ్‌ల్యాండ్‌ జట్టు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించింది. ప్రపంచంలో తమ ఉనికిని చాటిచెప్పేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. థాయ్‌ అమ్మాయిలు ప్రపంచకప్‌లో ఆడే అవకాశానికి పొంగిపోతూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసారు.

పాకిస్తాన్‌లో టీమిండియా ఆడాలని అభిమానులు ఏం చేసారంటే?!!పాకిస్తాన్‌లో టీమిండియా ఆడాలని అభిమానులు ఏం చేసారంటే?!!

గ్రూప్‌-బిలో భాగంగా శనివారం మాజీ ప్రపంచ ఛాంపియన్‌ వెస్టిండీస్‌, థాయ్‌ల్యాండ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన థాయ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. కొంచెరోయిన్‌కై (33), నరుయిమోల్‌ చైవై (13) రాణించారు. ఈ ఇద్దరు మినహా మరెవరూ డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు. విండీస్ బౌలర్లలో స్టెఫానీ టేలర్‌ మూడు వికెట్లు తీసింది.

అనంతరం 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విండీస్ మహిళలు 16.4 ఓవర్లకు 3 వికెట్లు నష్టపోయి ఛేదించారు. కెప్టెన్‌ స్టెఫానీ టేలర్‌ (26), క్యాంప్‌బెల్‌ (25) పరుగులతో అజేయంగా నిలిచారు. థాయ్‌ బౌలర్ సొరయ లాటె ఒక వికెట్ తీయగా.. మిగతా రెండు వికెట్లు రనౌట్ రూపంలో వచ్చాయి. విశ్వవేదికపై తొలి వికెట్‌ తీసిన థాయ్‌ క్రికెటర్‌గా లాటె రికార్డు సృష్టించింది.

అయితే మ్యాచ్‌ కోసం మైదానంలో అడుగుపెట్టిన క్షణం నుంచి థాయ్‌ అమ్మాయిలు క్రీడాస్ఫూర్తి ప్రదర్శించారు. టాస్‌ సమయంలో థాయ్‌ కెప్టెన్‌ సొర్నరిన్‌ టిపోచ్‌ విండీస్ సారథి స్టెఫానీ టేలర్‌కు ఓ బహుమతిని ఇచ్చింది. ఇక మ్యాచ్‌ ముగిశాక అందరూ ఒకే వరుసలో నిలబడి మైదానం నాలుగు వైపులకు నమస్కారం చేశారు. చిన్న జట్టైన తమకు ఇంత పెద్ద అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతను ప్రకటించారు. మ్యాచ్ ఓడినా కూడా చిరునవ్వులు చిందించారు. మ్యాచ్‌ అంతా నవ్వుతూనే ఉన్నారు.

Story first published: Sunday, February 23, 2020, 18:23 [IST]
Other articles published on Feb 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X