న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ ప్లేయింగ్ ఎలెవన్‌లో భారత ఆటగాళ్లకు దక్కని చోటు.. ఆసీస్ నుంచి ముగ్గురు! కెప్టెన్‌ ఎవరంటే?

ICC picks Most Valuable Team Of The T20 World Cup 2021, No Indian Included in Tournament.

దుబాయ్: నెలరోజులుగా క్రికెట్ అభిమానులను అలరించిన టీ20 ప్రపంచకప్ 2021 ఆదివారం ముగిసిన విషయం తెలిసిందే. దుబాయ్‌ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. వన్డే ఫార్మాట్‌లో ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆసీస్‌కు టీ20ల్లో ఇదే తొలి టైటిల్‌ కాగా.. మొదటిసారి ఫైనల్ పోరుకు అర్హత సాధించిన కివీస్‌ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. టీ20 ప్రపంచకప్ 2021 ముగిసిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను తాజాగా ప్రకటించింది. 12 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఐసీసీ సోమవారం ప్రకటించింది. పాకిస్తాన్ సారథి బాబర్ ఆజామ్‌ను ఐసీసీ కెప్టెన్‌గా ఎంచుకుంది.

భారత ఆటగాళ్లకు దక్కని చోటు:

భారత ఆటగాళ్లకు దక్కని చోటు:

అయితే ఐసీసీ ప్రకటించిన జట్టులో ఒక్క భారత ఆటగాడికి చోటు దక్కలేదు. వాస్తవానికి మనోళ్ల ప్రదర్శన చెప్పుకునే రీతిలో లేకపోవడమే ఇందుకు కారణం అని చెప్పొచ్చు. రోహిత్ శర్మ, కేఎల్ రాహల్, విరాట్ కోహ్లీల మెరుపులు 1-2 మ్యాచులకే పరిమితం అయ్యాయి. మరోవైపు రెండుసార్లు టీ20 ప్రపంచకప్‌ ఛాంపియన్‌ అయిన వెస్టిండీస్‌ నుంచి కూడా ఒక్క ఆటగాడికి చోటు దక్కకపోవడం గమనార్హం. ఇక టాప్ 8 జట్ల నుంచి కనీసం ఒక్కో ప్లేయర్ ఐసీసీ జట్టులో చోటు దక్కించుకున్నారు. టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియా నుంచి ఏకంగా ముగ్గురు ప్లేయర్స్ ఐసీసీ జట్టులో చోటు సంపాదించారు.

ఓపెనర్లుగా వార్నర్, బట్లర్‌:

ఐసీసీ తమ జట్టుకు ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్‌లను ఎంపిక చేసింది. టాప్ ఆర్డర్‌లో లెఫ్ట్, రైట్ కాంబినేషన్ ఎప్పుడూ ఆల్ టైం పర్ఫెక్ట్ అని పేర్కొంది. మెగా టోర్నీలో వార్నర్ 48.16 సగటుతో 289 పరుగులు చేసి.. 'మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచాడు. బట్లర్ 89.66 సగటుతో 269 పరుగులు చేశాడు. బాబర్ ఆజామ్, చరిత్ అసలంక, ఐడెన్ మార్క్‌రమ్‌లను ఐసీసీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లుగా ఎంచుకుంది. బాబర్ 60.60 సగటుతో 303 పరుగులు చేశాడు. శ్రీలంక ప్లేయర్ చరిత్ అసలంక 46.20 సగటుతో 231 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడాన్ మార్క్రామ్ 54 సగటుతో 162 పరుగులు చేశాడు. ఆల్‌రౌండర్‌గా ఎంచుకున్న మొయిన్ అలీ (131. 42 స్ట్రైక్ రేట్‌తో 92 పరుగులు, 11 సగటుతో 7 వికెట్లు) అద్భుతంగా రాణించాడు.

ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు:

ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు:

జోష్ హేజిల్‌వుడ్, ట్రెంట్ బౌల్ట్, అన్రిచ్ నోర్జ్, వనిందు హసరంగా, ఆడమ్ జంపాలను ఐసీసీ బౌలర్లుగా ఎంపిక చేసింది. శ్రీలంక ఆటగాడు హసరంగ 16 వికెట్లతో టోర్నీలో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియన్ స్పిన్నర్ జంపా 13 వికెట్లు, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ హేజిల్‌వుడ్ 11 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్‌ ఆటగాడు బౌల్ట్ 13 వికెట్లు తీయగా.. దక్షిణాఫ్రికా ప్లేయర్ నోర్జ్ 9 వికెట్లు పడగొట్టాడు. ఇక 12వ ప్లేయర్‌గా పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిదిని ఐసీసీ ఎంపిక చేసింది.

ఐసీసీ ఎంపిక చేసిన జట్టు ఇదే:

డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్‌, బాబర్ ఆజామ్, చరిత్ అసలంక, ఐడెన్ మార్క్‌రమ్‌, మొయిన్ అలీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రెంట్ బౌల్ట్, అన్రిచ్ నోర్జ్, వనిందు హసరంగా, ఆడమ్ జంపా, షాహీన్ అఫ్రిది (12వ ఆటగాడు).

Story first published: Monday, November 15, 2021, 17:44 [IST]
Other articles published on Nov 15, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X