Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) 207 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. విరాట్ కోహ్లీ(43 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 51), రజత్ పటీదార్(20 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 206 పరుగులు చేసింది.

కామెరూన్ గ్రీన్(20 బంతుల్లో 5 ఫోర్లతో 37 నాటౌట్)మెరుపులు మెరిపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్(3/30) మూడు వికెట్లు తీయగా.. టీ నటరాజన్(2/39)రెండు వికెట్లతో సత్తా చాటాడు. ప్యాట్ కమిన్స్, మయాంక్ మార్కండేకు తలో వికెట్ దక్కింది. విరాట్ కోహ్లీ స్లో బ్యాటింగ్.. నటరాజన్, ఉనాద్కత్ కట్టుదిట్టమైన బౌలింగ్‌ ఆర్‌సీబీ భారీ స్కోర్‌ అవకాశాలను దెబ్బతీసింది.

SRH vs RCB Virat Kohli slow batting helps RCB post 206 7

అదిరిపోయే ఆరంభం..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్(25) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. దూకుడుగా ఆడిన ఈ ఇద్దరూ.. స్కోర్ బోర్డును పరుగెత్తించారు. అయితే ఈ జోడీని నటరాజన్ విడదీసాడు. స్టన్నింగ్ డెలివరీతో ఫాఫ్ డుప్లెసిస్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన విల్ జాక్స్‌తో కలిసి కోహ్లీ ఆచితూచి ఆడాడు. దాంతో పవర్ ప్లేలో ఆర్‌సీబీ వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది.

ఆ వెంటనే విల్ జాక్స్(9)ను మయాంక్ మార్కండే క్లీన్ బౌల్డ్ చేయగా.. రజత్ పటీదార్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మయాంక్ మార్కండే వేసిన 11వ ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్స్‌లు బాది 27 పరుగులు పిండుకున్నాడు. ఇదే జోరులో 19 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

SRH vs RCB Virat Kohli slow batting helps RCB post 206 7

కోహ్లీ హాఫ్ సెంచరీ..
ఆర్‌సీబీ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. హాఫ్ సెంచరీ అనంతరం రెండు బంతుల వ్యవధిలోనే ఉనాద్కత్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 65 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

బ్యాటింగ్‌‌కు కామెరూన్ గ్రీన్ రాగా.. విరాట్ కోహ్లీ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఉనాద్కత్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో కోహ్లీ వెనుదిరిగాడు. ఆ వెంటనే మహిపాల్ లోమ్రోర్(7) సైతం ఔటవ్వడంతో ఆర్‌సీబీ పరుగుల వేగం తగ్గింది. క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ సాయంతో కామెరూన్ గ్రీన్ ధాటిగా ఆడాడు.

ప్యాట్ కమిన్స్ వేసిన 19వ ఓవర్‌లో గ్రీన్ రెండు బౌండరీలు బాదగా.. దినేశ్ కార్తీక్(11) ఓ బౌండరీ బాది క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో 15 పరుగులే వచ్చాయి. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన స్వప్నిల్ సింగ్ .. నటరాజన్ వేసిన ఆఖరి ఓవర్‌లో వరుసగా 6, 4 బాది ఆఖరి బంతికి క్యాచ్ ఔటయ్యాడు.

Story first published: Thursday, April 25, 2024, 21:20 [IST]
Other articles published on Apr 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+