రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 10 సీజన్లలో 400కు పైగా రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచారు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు.
ఈ సీజన్‌లో ఇప్పటికే విరాట్ కోహ్లీ 400 ప్లస్ రన్స్‌తో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2011 సీజన్‌లో 557 పరుగులు చేసిన కోహ్లీ.. 2013(634), 2015(505), 2016(973), 2018(530), 2019(464), 2020(466), 2021(405), 2023(639) సీజన్లతో పాటు తాజా సీజన్‌లో 400 పరుగులు చేశాడు. ఇక ఓపెనర్‌గానూ 4000 పరుగులు మైలురాయిని అందుకున్నాడు.

17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆర్‌సీబీకి ఇది 250వ మ్యాచ్ కాగా.. విరాట్ కోహ్లీ 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడలేదు. అరంగేట్ర ఐపీఎల్ సీజన్ నుంచి ఆర్‌సీబీకే ఆడుతున్న అతను ఇప్పటి వరకు 246 మ్యాచ్‌లు ఆడాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ.. ఈ సీజన్‌లో 4వ అర్థశతకం నమోదు చేశాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 206 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(43 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 51), రజత్ పటీదార్(20 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించగా.. కామెరూన్ గ్రీన్(20 బంతుల్లో 5 ఫోర్లతో 37 నాటౌట్)మెరుపులు మెరిపించాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్(3/30) మూడు వికెట్లు తీయగా.. టీ నటరాజన్(2/39)రెండు వికెట్లతో సత్తా చాటాడు. ప్యాట్ కమిన్స్, మయాంక్ మార్కండేకు తలో వికెట్ దక్కింది. విరాట్ కోహ్లీ స్లో బ్యాటింగ్.. నటరాజన్, ఉనాద్కత్ కట్టుదిట్టమైన బౌలింగ్ ఆర్‌సీబీ భారీ స్కోర్ అవకాశాలను దెబ్బతీసింది.