For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs RCB: ఫుల్‌ టాస్‌కు ఔటైన మార్క్‌రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!(వీడియో)

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఫుల్ టాస్ బాల్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్‌రమ్ ఎల్బీడబ్ల్యూ వెనుదిరిగాడు. ఫుల్‌టాస్‌కు ఔటవ్వడం చూసి కోహ్లీ నవ్వు ఆపుకోలేకపోయాడు. ప్రస్తుతం మార్క్‌రమ్ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఆర్‌సీబీ యువ స్పిన్నర్ స్వప్పిల్ సింగ్ వేసిన ఐదో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని స్వప్నిల్ ఫుల్‌టాస్‌గా వేయగా.. మార్క్‌రమ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. బంతి వేగాన్ని అంచనా వేయలేకపోయిన అతను ఎల్బీగా వెనుదిరిగాడు.

SRH vs RCB Virat Kohli Laughs After Sunrisers lose Aiden Markram wicket with full toss in IPL 2024

అంపైర్ నిర్ణయంపై సమీక్షకు వెళ్లిన మార్క్‌రమ్.. వికెట్ అని తేలడంతో నిరాశగా పెవిలియన్ చేరాడు. భారీ షాట్ ఆడాల్సిన ఫుల్ టాస్‌కు ఎల్బీగా వెనుదిరగడంతో విరాట్ కోహ్లీ నవ్వు ఆపుకోలేకపోయాడు. ఇదే ఓవర్‌ ఆఖరి బంతికి డేంజరస్ హెన్రీచ్ క్లాసెన్(7)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చిన స్వప్నిల్ సింగ్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

ఇక మార్క్‌రమ్ ఫుల్ టాస్‌కు ఔటవ్వడంపై నెటిజన్లు సైతం ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు మార్క్‌రమ్ ఔటైన తీరుపై సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. డగౌట్‌లో బాధతో కూడిన ఎక్స్‌ప్రెషన్‌తో కలినిపించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 206 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(43 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 51), రజత్ పటీదార్(20 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించగా.. కామెరూన్ గ్రీన్(20 బంతుల్లో 5 ఫోర్లతో 37 నాటౌట్)మెరుపులు మెరిపించాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్(3/30) మూడు వికెట్లు తీయగా.. టీ నటరాజన్(2/39)రెండు వికెట్లతో సత్తా చాటాడు. ప్యాట్ కమిన్స్, మయాంక్ మార్కండేకు తలో వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులు చేసి ఓటమిపాలైంది. అభిషేక్ శర్మ(13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31), ప్యాట్ కమిన్స్(15 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 31), షెహ్‌‌బాజ్ అహ్మద్(37 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 40 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆర్‌సీబీ బౌలర్లలో స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ రెండేసి వికెట్లు తీయగా.. విల్ జాక్స్, యశ్ దయాల్ తలో వికెట్ తీసారు.

Story first published: Thursday, April 25, 2024, 22:54 [IST]
Other articles published on Apr 25, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+