న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2021: యువరాజ్ సరసన మిచెల్ మార్ష్‌, జోష్ హేజిల్‌వుడ్!!

Mitchell Marsh, Josh Hazlewood joins Yuvraj Singhs elite list after AUS won T20 World Cup 2021

దుబాయ్‌: రెండు దశాబ్దాల పాటు వన్డే క్రికెట్‌ను ఏలిన ఆస్ట్రేలియా.. టీ20 ఫార్మాట్‌లో తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. అంచనాల్లేకుండా టీ20 ప్రపంచకప్‌ 2021లో అడుగుపెట్టిన ఆసీస్‌.. నిలకడైన ఆటతో టైటిల్‌ ఎగరేసుకుపోయింది. ఫీల్డింగ్, బౌలింగ్‌, బ్యాటింగ్‌లో సమిష్టిగా సత్తాచాటి అదుర్స్‌ అన్పించింది. దుబాయ్‌ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తుచేసింది. వన్డే ఫార్మాట్‌లో ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆసీస్‌కు టీ20ల్లో ఇదే తొలి టైటిల్‌ కాగా.. మొదటిసారి తుది పోరుకు అర్హత సాధించిన కివీస్‌ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

మార్ష్‌, హేజిల్‌వుడ్‌ సరికొత్త రికార్డు

మార్ష్‌, హేజిల్‌వుడ్‌ సరికొత్త రికార్డు

ఈ మ్యాచులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు మిచెల్‌ మార్ష్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌ సరికొత్త రికార్డు సృష్టించారు. వీరిద్దరూ భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ సరసన చేరారు. ఇప్పటివరకు మూడు ప్రపంచకప్‌లు సాధించిన జట్లలో ఉన్న ఏకైక ఆటగాడిగా నిలిచిన యువీ సరసన ఆస్ట్రేలియా ఆటగాళ్లు నిలిచారు. యువరాజ్‌ 2000లో అండర్‌-19, 2007లో టీ20 ప్రపంచకప్‌, 2011లో వన్డే ప్రపంచకప్‌ సాధించిన జట్లలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా యూవీ రికార్డు నెలకొల్పాడు. తాజాగా మార్ష్‌, హేజిల్‌వుడ్‌ ఆ రికార్డును చేరుకున్నారు. వీరిద్దరూ 2010లో అండర్‌-19 ప్రపంచకప్‌, 2015 వన్డే ప్రపంచకప్‌ సాధించారు. తాజాగా 2021 టీ20 ప్రపంచకప్‌ గెలుపొందిన ఆసీస్ జట్టులోనూ ఉన్నారు.

 రెండో స్థానానికి భారత్ స్కోర్

రెండో స్థానానికి భారత్ స్కోర్

టీ20ల్లో ఆస్ట్రేలియా జట్టుకు ఇదే తొలి టైటిల్‌. వన్డే ఫార్మాట్‌లో ఆసీస్‌ ఐదుసార్లు (1987, 1999, 2003, 2007, 2015) టైటిల్ ముద్దాడింది. పురుషుల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో (172/4 ) ఆసీస్ చేసిన స్కోర్ అత్యధికం. గతంలో పాకిస్థాన్‌పై భారత్‌ (2007) చేసిన 157/5 స్కోరు రెండో స్థానానికి చేరింది. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో కుమార సంగక్కర (2009) తర్వాత అర్ధ శతకం సాధించిన రెండో కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్‌ రికార్డుల్లోకెక్కాడు.

ఆదుకున్న విలియమ్సన్‌

ఆదుకున్న విలియమ్సన్‌

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కేన్‌ విలియమ్సన్‌ (48 బంతుల్లో 85; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ఆడాడు. అయితే మరో ఎండ్‌ నుంచి అతడికి సరైన సహకారం అందలేదు. మార్టిన్‌ గప్టిల్‌ (28), డారిల్‌ మిచెల్‌ (11), గ్లెన్ ఫిలిప్స్‌ (18), జేమ్స్ నీషమ్‌ (13 నాటౌట్‌), టీమ్ సీఫెర్ట్‌ (8 నాటౌట్‌) ధాటిగా ఆడలేకపోయారు.

తొలి పది ఓవర్లలో 57 పరుగులే చేసిన న్యూజిలాండ్‌.. కేన్ చెలరేగడంతో మిగతా 10 ఓవర్లలో 115 పరుగులు చేసింది. 21 పరుగుల వద్ద కేన్‌ మామకు జీవనాధారం లభించింది. దాంతో ఆ అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హజిల్‌వుడ్‌ 3 వికెట్లు పడగొట్టాడు.

 వార్నర్‌ మోత

వార్నర్‌ మోత

అనంతరం లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 173 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (38 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆరంభం ఇస్తే.. మిచెల్ మార్ష్‌ (50 బంతుల్లో 77 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) జట్టును గెలిపించాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ (18 బంతుల్లో 28 నాటౌట్‌; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌) ధాటిగా ఆడాడు. లీగ్ ఆరంభంలో వార్నర్ ఫామ్‌పై విమర్శలు వచ్చినా.. కీలక సమయంల్లో చెలరేగి జట్టుకు టైటిల్ అందించాడు/ న్యూజిలాండ్‌ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్‌కు రెండు వికెట్లు దక్కాయి. మిచెల్‌ మార్ష్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌', డేవిడ్‌ వార్నర్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌' అవార్డులు దక్కాయి.

Story first published: Monday, November 15, 2021, 14:57 [IST]
Other articles published on Nov 15, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X