Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs RCB: ఆ రెండు తప్పిదాలే మా ఓటమిని శాసించాయి: ప్యాట్ కమిన్స్

బౌలింగ్‌లో కొన్ని ఓవర్లలో ధారళంగా పరుగులివ్వడం.. బ్యాటింగ్‌లో వరుసగా వికెట్లు కోల్పోవడం తమ ఓటమిని శాసించిందని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో ఉప్పల్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన ప్యాట్ కమిన్స్ ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురి చేసిందన్నాడు. అయితే టీ20 ఫార్మాట్‌లో ప్రతీ మ్యాచ్ గెలవలేమని చెప్పాడు. 'ఈ రాత్రి మాకు ఏది కలిసి రాలేదు. బంతితో కొన్ని ఓవర్లలో ఎక్కువ పరుగులిచ్చాం. బ్యాటింగ్‌లో దురదృష్టవశాత్తు వరుసగా వికెట్లు కోల్పోయాం.

Pat Cummins says

ముందుగా బ్యాటింగ్ చేస్తే మాకు విజయాలు దక్కుతున్నాయి. గత కొన్ని మ్యాచ్‌ల్లో మేం ముందుగా బ్యాటింగ్ చేయడం కలిసొచ్చింది. ఈ క్రమంలోనే మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. ఈ మ్యాచ్‌లో మాకు ఏది కలిసి రాలేదు. జట్టు విజయాల తర్వాత కెప్టెన్‌గా నేను మాట్లాడితే.. పరాజయాల తర్వాత కోచ్ డానియల్ వెటోరీ మాట్లాడుతాడు.

మా కుర్రాళ్లంతా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. టీ20 క్రికెట్‌లో ప్రతీ మ్యాచ్ గెలవాలంటే కష్టమే. ఈ పరాజయం గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. దూకుడుగా ఆడటం మా శైలి. ఈ రోజు మాకు ఏది కలిసి రాలేదు.

ఈ టోర్నీ ప్రారంభంలోనూ మాకు ఓటములు ఎదురయ్యాయి. అయినా మేం అసాధారణ ప్రదర్శనతో విజయాలు అందుకున్నాం. మరోసారి అలానే పుంజుకుంటాం.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 206 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(43 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 51), రజత్ పటీదార్(20 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించగా.. కామెరూన్ గ్రీన్(20 బంతుల్లో 5 ఫోర్లతో 37 నాటౌట్)మెరుపులు మెరిపించాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్(3/30) మూడు వికెట్లు తీయగా.. టీ నటరాజన్(2/39)రెండు వికెట్లతో సత్తా చాటాడు. ప్యాట్ కమిన్స్, మయాంక్ మార్కండేకు తలో వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులు చేసి ఓటమిపాలైంది. అభిషేక్ శర్మ(13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31), ప్యాట్ కమిన్స్(15 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 31), షెహ్‌‌బాజ్ అహ్మద్(37 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 40 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

ఆర్‌సీబీ బౌలర్లలో స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, కామెరూన్ గ్రీన్ రెండేసి వికెట్లు తీయగా.. విల్ జాక్స్, యశ్ దయాల్ తలో వికెట్ తీసారు.

Story first published: Friday, April 26, 2024, 0:04 [IST]
Other articles published on Apr 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+