Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు.

'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. మేం ఎక్కడికి వెళ్లినా మా ఫ్యాన్స్ మాకు మద్దతు తెలుపుతున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఈ సీజన్‌లో అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ మ్యాచ్‌లో మేం భారీ స్కోర్ చేసి వారిపై ఒత్తిడిని పెట్టే ప్రయత్నం చేస్తాం. గత మ్యాచ్‌లో మేం అద్భుతంగా పోరాడాం. ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నాం.'అని ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు.

SRH vs RCB Pat Cummins says Jaydev Unadkat comes in for Washington Sundar in IPL 2024 Match at Uppal

ఇక్కడి అభిమానుల ప్రేమ అద్భుతమని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. 'సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడిగా నాకు ఇదే తొలి సంవత్సరం. కానీ ఆరెంజ్ జెర్సీలు ధరించిన అభిమానులను చూస్తుంటే సరైన జట్టులోకి వచ్చాననే అనుభూతి కలుగుతోంది. మేం గత మ్యాచ్‌ల్లోలానే స్వేచ్చగా బ్యాటింగ్ చేస్తాం.

బౌలింగ్ సైడ్ కాస్త అడ్జస్ట్ కావాల్సి ఉంది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఉనాద్కత్‌ను జట్టులోకి తీసుకున్నాం. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం.'అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి, షెహ్‌బాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, నటరాజన్, జయదేవ్ ఉనాద్కత్

ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, విల్ జాక్స్, రజత్ పటీదార్, కామెరూన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్, కర్ణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్

Story first published: Thursday, April 25, 2024, 19:17 [IST]
Other articles published on Apr 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+