న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

New Zealand vs Australia: వార్నర్, మార్ష్ హాఫ్ సెంచరీలు.. తొలిసారి టీ20 కప్‌ను ముద్దాడిన ఆస్ట్రేలియా!!

NZ vs AUS Final: Mitchell Marsh, David Warner win Australia their first Mens T20 World Cup

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌ కప్‌ను ఆస్ట్రేలియా తొలిసారి ముద్దాడింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఇంకా 7 బంతులు మిగిలి ఉండ‌గానే గెలిచింది. ఆస్ట్రేలియా ఆట‌గాళ్ల‌లో మిచెల్ మార్ష్‌, డేవిడ్ వార్న‌ర్ భారీ స్కోర్లు న‌మోదు చేశారు. ఇద్ద‌రూ హాఫ్ సెంచ‌రీ చేసి ఆస్ట్రేలియాను గెలిపించారు. వార్న‌ర్ 38 బంతుల్లో 53 ప‌రుగులు చేసి నాలుగు ఫోర్లు, 3 సిక్సులు బాది పెవిలియ‌న్ చేరాడు. మార్ష్ 50 బంతుల్లో 77 ప‌రుగులు చేశాడు. కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు పడగొట్టాడు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టైటిల్‌ను ఎలాగైనా గెల‌వాల‌ని బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఈసారి కూడా నిరాశే ఎదురైంది.

173 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. 2.3 ఓవర్ల వద్ద ఆస్ట్రేలియా 15 పరుగులు చేసి తొలి వికెట్ కోల్పోయింది. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ 7 బంతుల్లో 5 పరుగులు చేసి బౌలర్ ట్రెంట్ బౌల్ట్ చేతిలో ఔటయ్యాడు. అనంతరం డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ జట్టును ఆదుకున్నారు. ఇద్దరూ ఆచితూచి ఆడుతూ.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. దాంతో ఆసీస్ లక్ష్యం దిశగా సాగింది. వార్నర్ 37 బంతుల్లో 53 పరుగులు చేశాడు. మార్ష్ 50 బంతుల్లో 77 పరుగులు చేశాడు. వార్నర్ ఔట్ అయినా.. గ్లెన్ మాక్స్‌వెల్ అండతో మార్ష్ మిగతపని పూర్తిచేశాడు. మ్యాక్స్‌వెల్ 18 బంతుల్లో 28 ప‌రుగులు చేసి నాట్ అవుట్‌గా నిలిచాడు.

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టైటిల్‌ను ఎలాగైనా గెల‌వాల‌ని బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఈసారి కూడా నిరాశే ఎదురైంది. తొలిసారి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్స్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ఈ.. సారి ఎలాగైనా క‌ప్పు కొడుతుంద‌ని ఎక్కువ శాతం క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు భావించారు. కానీ ఈసారి కూడా న్యూజిలాండ్‌కు క‌ప్ దూర‌మైంది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ భారీ ప‌రుగులు వృథా అయిపోయాయి. 2019 వన్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైనల్లో కూడా కివీస్ ఓడిపోయిన విషయం తెలిసిందే.

అంతకుముందు న్యూజీలాండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి కివీస్ 172 ప‌రుగులు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ డారిల్ మిచెల్‌ (8 బంతుల్లో 11: ఒక సిక్స్‌) దూకుడుగా ఆడేందుకు యత్నించినా త్వరగానే ఔటయ్యాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్‌ కేన్‌విలియ‌మ్స‌న్ (85: 10 ఫోర్లు, 3 సిక్సర్లు)తో కలిసి మార్టిన్‌ గప్తిల్ (28) ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వీరిద్దరూ కలిసి 48 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అయితే ఆడమ్ జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన గప్తిల్‌ ఆసీస్‌ ఫీల్డర్‌ మార్కస్ స్టాయినిస్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గ్లెన్ ఫిలిప్స్ (18: ఒక ఫోర్, ఒక సిక్స్)తో కలిసి కేన్‌ విజృంభించాడు. ఆరంభంలో నిదానంగా ఆడిన కేన్‌.. తర్వాత దూకుడు పెంచాడు. ఈ క్రమంలో కెరీర్‌లో 14వ అర్ధ శతకం నమోదు చేశాడు.

ఒక పక్క ధాటిగా ఆడుతుండటం.. మరోవైపు బంతులు ఉండటంతో టీ20ల్లో కేన్‌ విలియమ్సన్‌ తొలి సెంచరీ సాధిస్తాడని అభిమానులు ఆశించినప్పటికీ.. అది సాధ్యపడలేదు. 85 పరుగుల వద్ద జొష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో బౌండరీ లైన్‌ వద్ద స్టీవ్ స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. చివర్లలో టీమ్ సీఫర్ట్‌ (8 నాటౌట్), జేమ్స్ నీషమ్‌ (13 నాటౌట్) బ్యాటింగ్‌తో కివీస్‌ స్కోరు 170 పరుగులు దాటింది. ఆసీస్‌ బౌలర్లలో హేజిల్‌వుడ్ 3, జంపా ఒక వికెట్‌ తీశారు. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తన కోటా నాలుగు ఓవర్లలో ఏకంగా 60 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

Story first published: Sunday, November 14, 2021, 23:36 [IST]
Other articles published on Nov 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X