T20 World Cup Final: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా! కాన్వే అవుట్.. సైఫెర్ట్‌ ఇన్!!

New Zealand vs Australia playing 11 is out: Conway is out and Seifert is in.

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌ 2021 ఫైన‌ల్స్‌కు తెర లేచింది. మరి కొద్దిసేప‌ట్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ‌ధ్య ఫైన‌ల్ పోరు ప్రారంభం కానుంది. ఈనేప‌థ్యంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది. అంద‌రూ ఊహించిన‌ట్టుగానే టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆసీస్ విన్నింగ్స్ జట్టునే కొనసాగిస్తోంది. మరోవైపు కివీస్ మాత్రం ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. గాయపడిన దేవాన్ కాన్వే స్థానంలో టిమ్ సైఫెర్ట్‌ జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచులో గెలిచిన జట్టు తొలిసారి ఛాంపియన్ అవుతున్న విషయం తెలిసిందే.

అంచనాల్లేకుండా ఫైనల్ పోరుకు అర్హత సాధించిన ఇరు జట్లలోనూ మ్యాచ్‌ విన్నర్లకు కొదవ లేకున్నా.. ఉత్కంఠభరిత మ్యాచ్‌ల్లో ఒత్తిడిని జయించడం బాగా అలవాటైన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ లైనప్‌ను కివీస్‌ బౌలర్లు ఎలా నిలువరిస్తారనేది ఆసక్తి రేపుతున్నది. ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శనతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్సీతో పాటు తుది జట్టులో చోటు కోల్పోయిన డేవిడ్‌ వార్నర్‌ ఆ కసినంతా ఈ టోర్నీలో కనబరుస్తున్నాడు. మరో ఓపెనర్‌ ఆరోన్ ఫించ్‌ వరుసగా విఫలమవుతున్నా.. ఆ ప్రభావం జట్టు మీద పడలేదంటే అందుకు వార్నర్‌ దూకుడే కారణం. ఇప్పటి వరకు టోర్నీలో 148.42 స్ట్రయిక్‌ రేట్‌తో 236 పరుగులు చేసిన వార్నర్.. అత్యధిక పరుగుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. అతడితో పాటు పాక్‌తో సెమీస్‌లో వీరవిహారం చేసిన మార్క్స్ స్టొయినిస్‌, మాథ్యూ వేడ్‌ మరోసారి కీలకం కానుండగా.. స్మిత్‌ మునుపటి జోరు కనబర్చాలని చూస్తున్నాడు.

కివీస్‌ కెప్టెన్‌ కేన్ విలియమ్సన్‌ ఈ టోర్నీలో బ్యాట్‌తో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. వనరులను సమర్థవంతంగా వినియోగించడంలో విజయవంతమయ్యాడు. మార్టిన్ గప్టిల్‌, డారిల్ మిచెల్‌, జేమ్స్ నీషమ్‌పై కివీస్‌ బ్యాటింగ్‌ ఎక్కువగా ఆధారపడి ఉంది. టోర్నీలోనే అత్యుత్తమ పేస్‌ దళం అందుబాటులో ఉండటం న్యూజిలాండ్‌కు కలిసొచ్చే అంశం. అయితే మిచెల్ శాంట్నర్‌, ఐష్ సోధి రూపంలో ఇద్దరు స్పెషలిస్ట్‌ ఉండటం అదనపు బలం. తమ జాతీయ జట్లు ప్రపంచకప్‌ ఫైనల్లో తలపడుతుంటే.. ఆ మ్యాచ్‌ చూసేందుకు స్వదేశంలో అభిమానులంతా టివిలకు అతుక్కుపోయారు. భారత కాలమానం ప్రకారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మధ్య ఆదివారం రాత్రి 7.30 గంటలకు ఫైనల్‌ ప్రారంభం కానుండగా.. ఆ సమయంలో ఆస్ట్రేలియాలో అర్ధరాత్రి ఒంటిగంటా.. న్యూజిలాండ్‌లో సోమవారం తెల్లవారుజామను 3 గంటల సమయం అవుతుండటమే దీనికి ప్రధాన కారణం.

తుది జట్లు:
న్యూజిలాండ్: మార్టిన్ గ‌ప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియ‌మ్స‌న్‌ (కెప్టెన్‌), గ్లెన్ ఫిలిప్స్‌, టిమ్ సైఫెర్ట్‌, జేమ్స్ నీష‌మ్‌, మిచెల్ సాంత్న‌ర్, ఆడ‌మ్ మిల్నే, టిమ్ సౌథీ, ఇష్ సోదీ, ట్రెంట్ బౌల్ట్.
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్న‌ర్‌, ఆరోన్ ఫించ్‌ (కెప్టెన్‌), మిచెల్ మార్ష్‌, స్టీవెన్ స్మిత్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, మార్క‌స్ స్టొయినిస్‌, మాథ్యూ వేడ్‌, పాట్ క‌మిన్స్‌, మిచెల్ స్టార్క్, ఆడ‌మ్ జంపా, జోష్ హ‌జిల్‌వుడ్.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, November 14, 2021, 20:16 [IST]
Other articles published on Nov 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X