న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాహుల్ ద్రవిడ్‌కు షాకిచ్చిన హైద‌రాబాద్ లేడీ ఫ్యాన్.. ఇంట్లోనే పర్మినెంట్‌గా..!!

Rahul Dravid Reveals Getting Upset At Parents After Female Fan Refused To Leave His House

బెంగళూరు: భారత క్రికెట్‌కు బీసీసీఐ అందించిన అత్యుత్తమ ఆటగాళ్లలో రాహుల్ ద్రవిడ్ ఒకరు. టీమిండియాకు 16 ఏళ్ల పాటు సేవలందించిన ద్రవిడ్‌ను అభిమానులు ముద్దుగా ద వాల్, మిస్టర్ డిపెండ‌బుల్, కెప్టెన్ కూల్‌గా పిలుచుకుంటారు. ద్రవిడ్ 90 మరియు 2000లలో టీమిండియా అగ్రశ్రేణి ఆటగాళ్ళలో ఒకరిగా వెలుగొందారు. ద్రవిడ్ 2003 నుంచి 2007 వరకు కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపట్టారు. తన ఆట, కెప్టెన్సీతో ద్రవిడ్ ఎంతో మంది అభిమానులను సంపాదించారు. అయితే అభిమానుల్లో లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండడం విశేషం.

<strong>'ప్రపంచంలో అశ్వినే అత్యుత్తమ​ స్పిన్నర్.. అత్యధిక వికెట్ల రికార్డును తిరగరాసే సత్తా ఉంది'</strong>'ప్రపంచంలో అశ్వినే అత్యుత్తమ​ స్పిన్నర్.. అత్యధిక వికెట్ల రికార్డును తిరగరాసే సత్తా ఉంది'

ఇంటికి లేడీ ఫ్యాన్

ఇంటికి లేడీ ఫ్యాన్

లేడీ అభిమానులు ఎక్కువగా ఉన్న రాహుల్ ద్రవిడ్‌కు ఓసారి ఊహించని షాక్ తగిలింది. ఈ విషయాన్ని తాజాగా ద్ర‌విడ్ గుర్తుచేసుకున్నారు. విషయంలోకి వెళితే... సుదీర్ఘ పర్యటన నుంచి ఇంటికొచ్చిన ద్రవిడ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒక హైద‌రాబాద్ లేడీ ఫ్యాన్‌ ద్రవిడ్‌ను కలిసేందుకు అతని ఇంటికి వెళ్లింది. విషయం తెలుసుకున్న ద్రవిడ్ త‌ల్లిదండ్రులు.. ఆ లేడీ అభిమానికి టీ ఇచ్చి వెయిట్ చేయమని చెప్పారు. కొంత సమయం తర్వాత ద్రవిడ్ త‌ల్లిదండ్రులు అతని గదికి వెళ్లి.. నిన్ను కలవడానికి ఓ లేడీ దాదాపు గంట‌న్న‌ర నుంచి వెయిట్ చేస్తోందని చెప్పారు.

ఇంట్లోనే పర్మినెంట్‌గా ఉండిపోతా

ఇంట్లోనే పర్మినెంట్‌గా ఉండిపోతా

నిద్ర లేచిన మిస్టర్ డిపెండ‌బుల్ సదరు లేడీ అభిమానిని కలవడానికి వెళ్లారు. ఆటోగ్రాఫ్ లేదా ఫొటో కోసం త‌ను వ‌చ్చింద‌ని భావించిన‌ ద్ర‌విడ్‌.. ఆమెతో కాపేపు మాట్లాడారు. ఆపై ఈమె చెప్పిన మాటలు విని ద వాల్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మిమ్మల్ని క‌ల‌వ‌డం కోసం ఇంట్లో గొడ‌వ‌పెట్టుకుని వ‌చ్చాన‌ని, ఇక్కడే పర్మినెంట్‌గా ఉండిపోతాన‌ని చెప్పింది. మొదటగా కంగారుపడిన ద్రవిడ్.. ఆ తర్వాత ఆమెకు నచ్చజెప్పి ఇంటికి పంపించారు. ఈ ఘటన నుంచి తాను పాఠాలు నేర్చుకున్న‌ట్లు తెలిపారు.

163 టెస్టులు.. 13,265 పరుగులు

163 టెస్టులు.. 13,265 పరుగులు

తన కెరీర్​లో 163 టెస్టులు ఆడిన రాహుల్​ ద్రవిడ్​.. 52 కుపైగా బ్యాటింగ్ సగటుతో 13,265 పరుగులు చేశారు. మొత్తంగా 31,184 బంతులను ఎదుర్కొన్నారు. ఎన్నోసార్లు ఆపదలో ఉన్న భారత జట్టును ఆదుకొని, పరాజయాలను తప్పించి 'ది వాల్​' పేరును దక్కించుకున్నారు. 344 వన్డేలలో 10889 రన్స్ చేసారు. ఇక ఒక టీ20లో 31 పరుగులు బాదారు. రిటైర్మెంట్ ప్ర‌క‌టించాక భార‌త్‌-ఎతోపాటు అండ‌ర్ -19 పురుషుల జ‌ట్టుకు కోచ్‌గా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం జాతీయ క్రికెట్ అకాడ‌మీ చీఫ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

2012లో క్రికెట్‌కు వీడ్కోలు

2012లో క్రికెట్‌కు వీడ్కోలు

2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ద్రవిడ్ మొత్తం 24,208 ప‌రుగులు నమోదు చేశారు. క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆరో బ్యాట్స్‌మ‌న్‌గా రికార్డు నమోదు చేశారు. క్రికెట్‌కు చేసిన సేవలకు గాను 2013లో కేంద్ర ప్రభుత్వం ద్రవిడ్‌ని పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. అంతేకాదు 2004లో ఐసీసీ ప్రకటించిన ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని రాహుల్ ద్రవిడ్ సొంతం చేసుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి భారత క్రికెట్ ద్రవిడ్.

Story first published: Tuesday, May 5, 2020, 15:06 [IST]
Other articles published on May 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X