Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆయన వల్లనే ఫామ్‌లోకి వచ్చాను: శుభ్‌మన్ గిల్

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సహకారంతోనే ఫామ్‌లోకి వచ్చానని స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. కష్టకాలంలో ఆయనే అండగా నిలిచాడని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. రాహుల్ ద్రవిడ్ చెప్పిన మాటలను అభిమానులతో పంచుకున్నాడు. 'మీరు కాకపోతే ఎవరు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?- రాహుల్ ద్రవిడ్'అనే వ్యాఖ్యలను శుభ్‌మన్ గిల్ పోస్ట్ చేశాడు.

ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు ముందు శుభ్‌మన్ గిల్ పేలవ ఫామ్‌తో సతమతమయ్యాడు. గత 12 ఇన్నింగ్స్‌ల్లో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. వరుసగా విఫలమవుతూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఎన్ని విమర్శలు వచ్చినా శుభ్‌మన్ గిల్‌కు రాహుల్ ద్రవిడ్ అండగా నిలిచాడు. జట్టు నుంచి తప్పించకుండా ప్రోత్సహించాడు.

Shubman Gill shares motivational quote of Rahul Dravid after India win in Ranchi Test

ద్రవిడ్ సహకారంతో వైజాగ్ టెస్ట్‌లో శుభ్‌మన్ గిల్ శతకం సాధించాడు. మూడో టెస్ట్‌లో 90 పరుగులు చేశాడు. నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో క్లిష్ట పరిస్థితుల్లో హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు శుభ్‌మన్ గిల్ 8 ఇన్నింగ్స్‌ల్లో 48 సగటుతో 342 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ తర్వాత ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఓటమితో ప్రారంభించిన టీమిండియా.. తర్వాతి మూడు మ్యాచ్‌లను గెలిచి 3-1తో మరో టెస్ట్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది.

ఇరు జట్ల మధ్య ఐదో టెస్ట్ ధర్మశాల వేదికగా మార్చి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ అనంతరం శుభ్‌మన్ గిల్.. మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ గుజరాత్ టైటాన్స్‌ను నడిపించనున్నాడు. హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయడంతో శుభ్‌మన్ గిల్‌కు గుజరాత్ టైటాన్స్ సారథ్య బాధ్యతలు దక్కాయి.

Story first published: Tuesday, February 27, 2024, 22:00 [IST]
Other articles published on Feb 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+