న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్.. భారత్‌ను చూసి నేర్చుకోవాలి: షోయబ్ మాలిక్

Pakistan needs to learn from Indian system: Shoaib Malik

న్యూ ఢిల్లీ: చిరకాల ప్రత్యర్థి పాక్‌‌తో తలపడేందుకు భారత్‌కు చక్కటి అవకాశం లభించింది. ఆసియా కప్‌లో భాగంగా బుధవారం లీగ్ దశ మ్యాచ్‌లోనూ.. ఆదివారం సూపర్ 4 దశ మ్యాచ్‌లోనూ ఆడిన పాక్ ప్రదర్శన పెద్దగా ఆకట్టుకునేలా లేదనే సంగతి తెలిసిందే. ఆ జట్టు కాగితంపైనే బలంగా ఉందని, ఆటతీరు పేలవంగా ఉందని క్రికెట్ నిపుణులు విమర్శిస్తున్నారు.

<strong>'పొరబాటు పడ్డాను.. ఆ సమీక్షకు వెళ్లాల్సింది కాదు'</strong>'పొరబాటు పడ్డాను.. ఆ సమీక్షకు వెళ్లాల్సింది కాదు'

భారత్ చేతిలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడటంతో పాక్ కోచ్ మిక్కీ ఆర్థర్ సైతం కాస్త అసహనం వ్యక్తం చేశాడు. ఓపెనర్లు, బౌలర్లు తమ ప్రణాళికలను ఎలా అమలు పర్చాలో భారత్‌ను చూసి నేర్చుకోవాలని ఆర్థర్ హితవు పలికాడు. వారికి డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చల ఫలితంగా ఓటమి భయం పట్టుకుందని అభిప్రాయపడ్డాడు. అయితే జట్టు ప్రదర్శనలో పరవాలేదనిపించిన షోయబ్ మాలిక్ తమ జట్టు ఆట తీరును విశ్లేషిస్తున్నాడు.

ఈ క్రమంలో భారత క్రికెట్ వ్యవస్థ నుంచి పాకిస్థాన్ పాఠాలు నేర్చుకోవాలని వెటరన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ అభిప్రాయపడ్డాడు. బంగ్లాదేశ్‌తో సెమీస్ లాంటి మ్యాచ్‌కు ముందు మాలిక్ ఈ వ్యాఖ్యలు చేశాడు. జట్టు నిర్మాణ ప్రక్రియ జరుగుతున్నప్పుడు సమయం పడుతుంది. భయపడటానికి, ఆటగాళ్లను మార్చడానికి ఇది సమయం కాదు. ఆటగాళ్లను పదే పదే మారిస్తే కొత్తవాళ్లకు కాస్త టైం కావాలి. ఓసారి భారత్‌ను చూడండి. వారెలా ఆటగాళ్లను తయారు చేసుకున్నారో చూడండి.

ప్రపంచంలో భారత్‌దే అత్యుత్తమ జట్టు. కెప్టెన్, సెలెక్షన్ కమిటీ, మేనేజ్‌మెంట్ ఎంపిక చేసిన ఆటగాళ్లకు నమ్మకం కల్పించాలని మాలిక్ చెప్పుకొచ్చాడు. మ్యాచ్ ముగిశాక పీసీబీ చైర్మన్ డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చి మాలో ఆత్మవిశ్వాసం కల్పించాడు. ఇలాంటివి జరుగుతాయి, అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని సూచించాడని మాలిక్ చెప్పాడు. జట్టులో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందన్న ఆర్థర్ వ్యాఖ్యలతో మాలిక్ ఏకీభవించాడు.

Story first published: Wednesday, September 26, 2018, 17:02 [IST]
Other articles published on Sep 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X