మైదానంలో పాక్ క్రికెటర్ అసభ్య ప్రవర్తన (వీడియో)
పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ ఇఫ్తికర్ అహ్మద్ అసభ్యంగా ప్రవర్తించాడు. సహచర ఆటగాడైన అసద్ షఫీక్‌తో అనవసరంగా గొడవపడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు ఇఫ్తికర్ అహ్మద్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సింద్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బుధవారం కరాచీ ఘాజీ, లార్కణ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ గొడవ చోటు చేసుకుంది. కరాచీ ఘాజీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇఫ్తికర్ అహ్మద్.. లార్కాణ ఛాలెంజర్స్ కెప్టెన్ అసధ్ షఫీక్‌ను ఔట్ చేశాడు. వికెట్ తీసిన ఆనందంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఇఫ్తికర్.. అసధ్ షఫీక్‌పై నోరుపారేసుకున్నాడు.

ఇఫ్తికర్ చర్యతో ఆగ్రహానికి గురైన అసధ్ షఫీక్ అతనికి ధీటుగా బదులిచ్చాడు. దాంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొనగా.. అంపైర్లు, ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకొని అడ్డుకున్నారు. అయితే ఇఫ్తికర్ బౌలింగ్‌లో అసద్ షఫీక్ సిక్స్, బౌండరీ బాదడంతో అతను ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఔటైన వెంటనే కోపంగా సంబరాలు చేసుకున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కరాచీ ఘాజీ టీమ్ 160 పరుగులు చేయగా.. లక్ష్య చేధనకు దిగిన లార్కాణ ఛాలెంజర్స్ 92 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ఇఫ్తికర్ 69 పరుగులు చేయడంతో పాటు మూడు వికెట్లు తీసాడు. ఈ గొడవ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా తనపై విమర్శలు రావడంతో ఇఫ్తికర్ అహ్మద్ క్షమాపణలు చెప్పాడు.
'మైదానంలో నా ప్రవర్తనకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. నేను అలా రియాక్ట్ అవ్వాల్సింది కాదు. హీట్ ఆఫ్ మూమెంట్‌లో అలా జరిగిపోయింది. మ్యాచ్ అనంతరం అసద్ షఫీక్ భాయ్‌కి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పాను. మేం ఇద్దరం కలిసి చాలా క్రికెట్ ఆడాం.'అని ఇఫ్తికర్ అహ్మద్ తెలిపాడు.
2010-2020 మధ్య పాకిస్థాన్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అసద్ షఫీక్.. 77 టెస్ట్‌లు, 60 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 6188 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు.. 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఇఫ్తికర్ అహ్మద్ పాకిస్థాన్ టీ20 టీమ్‌లో కొనసాగుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications