ఊహించినట్లుగానే ఐపీఎల్‌పై పాకిస్థాన్ కన్ను పడింది. ఈ మెగాలీగ్‌లో పాకిస్థాన్ ప్లేయర్లకు ఎంట్రీ లేని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో పాకిస్థాన్ ప్లేయర్లు ఉంటే బాగుంటుందని పాక్ అభిమానులు నెట్టింట్లో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అడుక్కోవడంలో డిఫ్రెంట్‌గా అన్నట్లుగా లీగ్‌లో తమ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని కొందరు భిన్నంగా పోస్ట్‌లు చేస్తున్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెర్సీలో విరాట్ కోహ్లితో పాటు బాబర్ అజామ్, ముంబై ఇండియన్స్ బ్లూ జెర్సీలో జస్ప్రీత్ బుమ్రాతో పాటు షాహిన్ అఫ్రిది, అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో మహ్మద్ రిజ్వాన్ ఉన్నట్లు ఓ ఫ్యాన్ ఫొటోలు ఎడిట్ చేసి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. దానికి 'ఇది నిజం కావాలని భారత్, పాకిస్థాన్ క్రికెట్ అభిమానుల కల' అని క్యాప్షన్ ఇచ్చాడు.

దీనికి టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. నిజాన్ని కాస్త ఘూటుగా, కఠినంగా పాక్ అభిమానులకు అర్థమయ్యేలా భజ్జీ చెప్పాడు. ''భారతీయులకు ఇలాంటి కోరికలు ఉండవు. మీరు కలలు కనడం ఆపేయండి. ఇక చాలు.. నిద్ర లేవండి'' అని హర్భజన్ బదులిచ్చాడు.
దేశ సరిహద్దుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు కొన్నేళ్ల నుంచి జరగట్లేదు. ఐసీసీ నిర్వహిస్తున్న టోర్నీల్లోనే భారత్-పాక్ తలపడుతున్నాయి. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైన తొలి సీజన్‌లో పాకిస్థాన్ ప్లేయర్లు పాల్గొన్నారు. 2008 సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టులో కమ్రాన్ అక్మల్, యునిస్ ఖాన్, సోహెల్ తన్వీర్ ఉన్నారు.
ఆ తొలి సీజన్‌లో సోహెల్ తన్వీర్ అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 12 సగటుతో 22 వికెట్లు తీశాడు. వాళ్లతో పాటు మహ్మద్ హఫీజ్, సల్మాన్ బట్, ఉమర్ గుల్, మహ్మద్ ఆసిఫ్, షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిది వంటి పాక్ స్టార్లు 2008 సీజన్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తత, రాజకీయ కారణాలతో పాకిస్థాన్ ప్లేయర్లకు ఐపీఎల్‌లో ఆడటానికి భారత ప్రభుత్వం అవకాశం ఇవ్వట్లేదు.
అప్పటి నుంచి ఐపీఎల్ జరుగుతున్న సమయంలో భారత్‌పై పాక్ అభిమానులు, మాజీలు, ఆటగాళ్లు తమ అక్కసు వెళ్లగక్కుతూ ఉన్నారు. కాగా, మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.