Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జూనియర్ కోహ్లి ‘అకాయ్’ రికార్డుల మోత.. పాకిస్థాన్‌లో సంబరాలు (Video)

విరాట్ కోహ్లి - అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఫిబ్రవరి 15న అనుష్క శర్మ పండింటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మంగళవారం పంచుకున్నారు. తన కుమారుడికి అకాయ్ (Akaay) అని పేరు పెట్టినట్లు తెలిపారు.

''ఫిబ్రవరి 15న మా కుమారుడు అకాయ్‌ను ఈ లోకంలోకి స్వాగతించాం. మా జీవితంలోనే మధురమైన ఈ సమయంలో మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలను కోరుకుంటున్నాం. మా వ్యక్తిగత గోప్యతను గౌరవించండి' అంటూ జూనియర్ కోహ్లి గురించి విరాట్ కోహ్లి ఇన్‌‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. అయితే నెట్టింట్లో ఈ పోస్ట్ రికార్డు సృష్టించింది.

Virat Kohli Junior Akaay started records and Kohli fans Celebrations in Pakistan Video goes viral

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పోస్ట్ గంటలోనే అయిదు మిలియన్ లైకులను అందుకుంది. ఆసియాలోనే అత్యంత వేగంగా ఎక్కువగా లైకులను అందుకున్న పోస్ట్‌గా రికార్డు సృష్టించింది. దీంతో జూనియర్ కోహ్లి కూడా రికార్డులు మొదలుపెట్టాడని కోహ్లి ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ప్రస్తుతం 'అకాయ్' పోస్ట్‌ను సుమారు ఎనిమిది మిలియన్ లైక్స్ వచ్చాయి.

మరోవైపు అకాయ్ పేరు గురించి నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు. దాని అర్థమేంటని ఆరాతీస్తున్నారు. ఇది సంస్కృతం, టర్కీ పదాలు. సంస్కృతంలో అకాయ్ అంటే 'అమరుడు', 'చిరంజీవుడు' అనే అర్థం వస్తుంది. అలాగే శివుడు అనే అర్థం కూడా వస్తుందని అంటున్నారు. హిందీలో 'కాయ్‌' అంటే శరీరమని.. 'అకాయ్‌' అంటే భౌతిక శరీరానికి మించినవాడు. మరోవైపు టర్కీ భాషలో ఈ పదానికి 'ప్రకాశిస్తున్న చంద్రుడు' అనే అర్థం వస్తుంది. ఇక కోహ్లి-అనుష్క తమ కుమారైకు దుర్గాదేవి అని అర్థం వచ్చేలా 'వామిక' అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.

కాగా, స్టార్ క్రికెటర్ రెండో సారి తండ్రి కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నతన అభిమానుల నుంచి కోహ్లి శుభాకాంక్షలు అందుకుంటున్నాడు. అయితే పాకిస్థాన్‌లో ఉన్న కొందరు ఫ్యాన్స్ స్వీట్స్ పంచుతూ సెలబ్రేషన్స్ చేశారు. క్రికెట్‌ను ప్రేమించే అందరికీ కోహ్లి‌పై అమితాభిమానం ఉంటుందని, ఎంతో మందికి కోహ్లి స్పూర్తి ఇచ్చాడని, ఇప్పుడు మరో సూపర్ స్టార్ అకాయ్ వస్తున్నాడని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Story first published: Wednesday, February 21, 2024, 10:35 [IST]
Other articles published on Feb 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+