13 ఏళ్ల తర్వాత..: పాక్‌లో మ్యాచ్‌లు ఆడాలంటూ ఇంగ్లాండ్‌కు ఆహ్వానం

Posted By:
Pakistan invites England cricket team back after 13 years

హైదరాబాద్: పాకిస్థాన్‌లో మ్యాచ్‌లు ఆడాల్సిందిగా 13 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టుని పాక్ ఆహ్వానించింది. 2005లో పాకిస్థాన్‌లో చివరిసారిగా ఇంగ్లాండ్ జట్టు పర్యటించింది. ఇటీవల వెస్టిండిస్ జట్టు మూడు టీ20ల సిరిస్‌ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

ఈ నేపథ్యంలో భద్రతా పరమైన అనుమానాలు పెట్టుకోవద్దంటూ పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అహసన్ ఇక్బాల్ ఇంగ్లాండ్‌కు సూచించారు. ఈ మేరకు ఆయన భద్రతాపరమైన హామీ ఇస్తూ యుకే హై కమీషనర్‌ థామస్ డ్రూకి ఆయన ఆహ్వానం పంపారు.

'పాకిస్థాన్‌లో విజయవంతంగా అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించాం. తీవ్రవాదాన్ని, అతివాదులను ఓడించామనడానికి ఇదే నిదర్శం' అని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి అహసన్ ఇక్బాల్ అధికారిక ప్రకనట చేశారు. 2009లో శ్రీలంక క్రికెటర్లు లాహోర్‌లో మ్యాచ్ ఆడేందుకు బస్సులో ప్రయాణిస్తుండగా ఉగ్రవాదులు దాడి చేశారు.

ఈ దాడిలో పలువురు శ్రీలంక క్రికెటర్లకు గాయాలు అవ్వగా, ఇద్దరు స్థానికులు చనిపోయారు. దీంతో అప్పటి నుంచి టెస్టు హోదా కలిగిన ఏ క్రికెట్ జట్టు కూడా పాకిస్థాన్‌లో పర్యటించేందుకు సాహసించలేదు. దీంతో చేసేదేమి లేక యూఏఈ వేదికగా సిరిస్‌లు నిర్వహించింది.

అయితే ఇటీవల శ్రీలంక, వెస్టిండీస్‌ జట్లతో సొంతగడ్డపైనే పాకిస్థాన్ మ్యాచ్‌లను నిర్వహించింది. అంతేకాదు ఇటీవల ముగిసిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (ఐపీఎస్ఎల్) ప్లేఆఫ్ మ్యాచ్‌‌లను సైతం పాకిస్థాన్ వేదికగా నిర్వహించింది. దీంతో భదత్రాపరమైన అనుమానాలు వద్దని.. క్రికెటర్లకి తాము కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామంటూ పాక్ ప్రభుత్వం చెప్పుకొస్తోంది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Thursday, April 5, 2018, 15:36 [IST]
Other articles published on Apr 5, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి