న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం అంత ఈజీ కాదు: కేఎల్ రాహుల్

KL Rahul Reveals That The Pressure To Replace MS Dhoni Behind Wickets Was Immense

బెంగళూరు: సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదని టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ అన్నాడు. అంతేకాకుండా అతని స్థానంలో ఉండి ప్రేక్షకుల అంచనాలు అందుకోవడం చాలా కష్టమన్నాడు. 2014లో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించిన ఎంఎస్ ధోనీ.. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత అతను క్రికెట్ నుంచి సుదీర్ఘ విరామం తీసుకున్నాడు.

ధోనీ స్థానంలో తొలుత జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్.. ఊహించినంతగా రాణించలేదు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయంతో అనూహ్యంగా కీపింగ్ బాధ్యతలు అందుకున్న రాహుల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అటు బ్యాటింగ్.. ఇటు కీపింగ్‌లో తనదైన శైలిలో రాణించి ధోనీకి తానే ప్రత్యామ్నాయమని ప్రశంసలందుకున్నాడు.

న్యూజిలాండ్ గడ్డపై మెరవడంతో..

న్యూజిలాండ్ గడ్డపై మెరవడంతో..

ముఖ్యంగా న్యూజిలాండ్ పర్యటనలో అతని బ్యాటింగ్, కీపింగ్ అమోఘం. కొన్ని మ్యాచ్‌ల్లో అతని స్టంపౌట్‌లు ధోనీని తలపించాయి. ఓ ఫ్రోఫెషనల్ వికెట్ కీపర్ లేడనే లోటును తీర్చాయి. దీంతో రాహుల్‌నే కీపర్‌గా కొనసాగించాలనే డిమాండ్ వ్యక్తమైంది. కేవలం దేశవాళి, ఐపీఎల్‌లో మాత్రమే కీపింగ్ చేసే రాహుల్.. అంతర్జాతీయ వేదికపై కూడా అదరగొట్టడంతో అతనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ధోనీ స్థానాన్ని జట్టులో భర్తీ చేసే సత్తా కేఎల్ రాహుల్‌కి మాత్రమే ఉందని కొందరు క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు.

ప్రేక్షకులు అనుకుంటేనే..

ప్రేక్షకులు అనుకుంటేనే..

కానీ, ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం సులభం కాదని స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో రాహుల్ చెప్పుకొచ్చాడు. ‘ప్రేక్షకుల సమూహం వల్ల భారత్ కోసం ఆడుతున్న ప్రతీసారి నాకు భయంగా ఉంటుంది. ఒక్కసారి తడబడితే.. ధోనీ స్థానాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేమని అనుకుంటారు. ఎప్పుడూ ధోనీలా అడాలని కోరుకుంటారు. అయితే మహీలాంటి ఓ దిగ్గజ కీపర్ బ్యాట్స్‌మెన్‌ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులభమైన విషయం కాదు. అతనికి ప్రత్నామ్నాయంగా ఇంకొకరిని ప్రేక్షకులు ఆహ్వానించేవరకు కష్టమే.' అని రాహుల్ అన్నాడు.

నాకు కీపింగ్ కొత్త కాదు..

నాకు కీపింగ్ కొత్త కాదు..

ఇక భారత్‌ తరఫున 32 వన్డేలు, 42 టీ20లు ఆడిన కేఎల్ రాహుల్.. తనకు కీపింగ్ చేయడం ఏం కొత్త కాదన్నాడు. ఐపీఎల్‌లో దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటక తరఫున కీపింగ్ చేస్తుంటానని గుర్తు చేశాడు. ‘క్రికెట్‌ను బాగా ఫాలో అయ్యేవారికి నేనో కీపర్‌ననే విషయం తెలిసే ఉంటుంది. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటక తరఫున ప్రతీసారి నేను కీపింగ్ చేస్తాను. వికెట్ కీపింగ్‌కు నాకు కొత్తకాదు. కానీ నాకంటే మెరుగైన ఆటగాడు.. జట్టు అవసరాలకు తగ్గట్టు ఆ స్థానానికి న్యాయం చేస్తే నాకెలాంటి అభ్యంతం లేదు.'అని కూడా రాహుల్ నొక్కి చెప్పాడు. ప్రస్తుత పరిస్థితిల్లో ధోనీ కెరీర్ ముగిసినట్టేనని ప్రచారం జరుగుతుంది. చాలా మంది మాజీ క్రికెటర్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధోనీ ప్రత్యామ్నాయం ఎవరా? అనేదానిపై తీవ్ర చర్చ జరుగుతుంది.

ప్రధాని మోదీని ప్రశంసించిన పాక్ మాజీ పేసర్

Story first published: Monday, April 27, 2020, 19:22 [IST]
Other articles published on Apr 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X