Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం

లక్నో సూపర్ జెయింట్స్ అదరగొట్టింది. సొంతమైదానంలో ఆల్‌రౌండ్‌ షోతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. కేఎల్ రాహుల్ (82; 53 బంతుల్లో, 9x4, 3x6), క్వింటన్ డికాక్ (54; 43 బంతుల్లో, 5x4, 1x6) అర్ధశతకాలతో కదం తొక్కారు. నికోలస్ పూరన్ (23*; 12 బంతుల్లో, 3x4, 1x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (57*; 40 బంతుల్లో, 5x4, 1x6) టాప్ స్కోరర్. ఆఖర్లో ఎంఎస్ ధోనీ (28; 9 బంతుల్లో, 3x4, 2x6) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. అజింక్య రహానె (36; 24 బంతుల్లో, 5x4, 1x6), మొయిన్ అలీ (30; 20 బంతుల్లో, 3x6) ఆకట్టుకున్నారు. లక్నో బౌలరల్లో కృనాల్ పాండ్య (2/16) రెండు వికెట్లతో సత్తాచాటాడు.

LSG

అనంతరం ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ రెండు వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో విజయం సాధించింది. అయితే లక్నో ఛేజింగ్‌ను నిదానంగా ప్రారంభించింది. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్‌ను జాగ్రత్తగా ఎదుర్కొని మూడు పరుగులే చేసింది. రెండో ఓవర్ నుంచి బౌండరీల మోత మొదలైంది. డికాక్ సంయమనంతో ఆడితే కేఎల్ రాహుల్ దూకుడుగా ఆడాడు. రాహుల్ ముచ్చటైన బౌండరీలతో, స్టైలిస్ట్ సిక్సర్లతో స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. దీంతో పవర్‌ప్లేలో లక్నో 54 పరుగులు చేసింది.

పవర్‌ప్లే ముగిసిన అనంతరం కూడా రన్‌రేటు తగ్గకుండా డికాక్, రాహుల్ బ్యాటింగ్ కొనసాగించారు. ఈ క్రమంలో 31 బంతుల్లో రాహుల్, 41 బంతుల్లో డికాక్ అర్ధశతకాలు అందుకున్నారు. అయితే హాఫ్ సెంచరీ సాధించిన అనంతరం ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో డికాక్ ఔటయ్యాడు. ఈ క్రమంలో వీరిద్దరు తొలి వికెట్‌కు 139 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఐపీఎల్-2024లో ఏ జట్టుకైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం.

డికాక్ ఔటైనప్పటికీ వన్‌డౌన్‌లో వచ్చిన నికోలస్ పూరన్‌తో కలిసి రాహుల్ బౌండరీలతో హోరెత్తించాడు. అయితే జడేజా అద్భుతమైన క్యాచ్‌కు రాహుల్ వెనుదిరిగాడు. అనంతరం స్టొయినిస్‌ (8*; 7 బంతుల్లో)తో కలిసి పూరన్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. సీఎస్కే బౌలర్లలో పతిరన, ముస్తాఫిజుర్ తలో వికెట్ తీశారు.

Story first published: Friday, April 19, 2024, 23:21 [IST]
Other articles published on Apr 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+