Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!(వీడియో)

లక్నో సూపర్ జెయింట్స్(ఎల్‌ఎస్‌జీ) వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్నమ్యాచ్‌లో రాహుల్.. స్టన్నింగ్ వికెట్ కీపింగ్‌తో ఆకట్టుకున్నాడు. రాహుల్ సెన్సేషనల్ క్యాచ్‌కు ఓపెనర్ అంజింక్యా రహానే(1) బిత్తరపోయాడు.

మ్యాట్ హెన్రీ వేసిన తొలి ఓవర్‌లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ చివరి బంతిని హెన్రీ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. రహానే కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్‌ వైపు దూసుకెళ్లగా.. రాహుల్ సూపర్ డైవ్‌తో సింగిల్ హ్యాండ్‌తో బంతిని అందుకున్నాడు. రాహుల్ సెన్సేషనల్ క్యాచ్‌కు రహానే బిత్తరపోయాడు. నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

CSK vs LSG KL Rahul takes stunning catch to dismiss Ajinkya Rahane in IPL 2024 Match vs Chennai

కేఎల్ రాహుల్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అచ్చం పక్షిలానే రాహుల్ డైవ్ చేశాడని, అసాధారణ వికెట్ కీపింగ్ అని కొనియాడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు శుభారంభం దక్కలేదు. రాహుల్ స్టన్నింగ్ క్యాచ్‌కు రహానే ఔటవ్వగా.. డారిల్ మిచెల్‌(11)ను యష్ ఠాకూర్ ఔట్ చేశాడు. దాంతో ఆ జట్టు పవర్ ప్లేలో 2 వికెట్లకు 49 పరుగులు చేసింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన జడేజాతో కలిసి కెప్టెన్ గైక్వాడ్ ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో అతను 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Story first published: Tuesday, April 23, 2024, 20:30 [IST]
Other articles published on Apr 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+