For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs LSG: మా ఓటమికి కారణం అదే- KL రాహుల్

ఈడెన్‌ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ ఎనిమిది వికెట్ల తేడాతో ఘోర పరాజాయన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 161 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (45; 32 బంతుల్లో, 2x4, 4x6), కేఎల్ రాహుల్ (39; 27 బంతుల్లో, 3x4, 2x6) రాణించారు. మిచెల్ స్టార్క్ (3/28) మూడు వికెట్లతో మెరిశాడు.

అనంతరం ఛేదనలో కోల్‌కతా నైట్ రైడర్స్ 15.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (89*; 47 బంతుల్లో, 14x4, 3x6) అర్ధశతకంతో సత్తాచాటాడు. శ్రేయస్ అయ్యర్ (38*; 38 బంతుల్లో, 6x4) నిలకడగా ఆడాడు. కాగా, ఐపీఎల్‌ చరిత్రలో లక్నోపై కేకేఆర్‌కు ఇదే తొలి విజయం. అంతకుముందు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో లక్నో చేతిలో కేకేఆర్ ఓడింది.

KKR vs LSG That is where I think we lost the game - KL Rahul

మ్యాచ్ అనంతరం ఓటమి గల కారణాల గురించి కేఎల్ రాహుల్ వివరించాడు. ''ఇది కఠినమైన రోజు. దీన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. ఐపీఎల్‌లో ప్రతి జట్టుకు ఇలాంటి అనుభవం ఎదురవుతుంటుంది. దీని గురించి ప్రత్యేకంగా చర్చించాలనుకోవట్లేదు. మేం ఎక్కడ తప్పుచేశాం? ఏ విభాగాల్లో మెరుగవ్వాలని అనే విషయంపై ఆలోచిస్తాం. లైట్ల వెలుతురులో బంతి గమనం మారింది''

''ఇక మా బ్యాటింగ్ విషయానికొస్తే.. చెత్త షాట్లు ఆడామని అనుకోవట్లేదు. కానీ మేం ఆడిన షాట్లు సరిగా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాం. అంతేగాక క్రమంగా వికెట్లు కోల్పోవడంతో 30 పరుగులు తక్కువగా సాధించాం. వికెట్లు మా చేతుల్లో ఉండి, మా టాప్-4 బ్యాటర్లలో ఒక్కరు ఉన్నా మెరుగైన స్కోరు సాధించేవాళ్లం. ఇదే మా ఓటమికి కారణం అయ్యింది''

''బౌలింగ్ విషయానికొస్తే.. మేం వికెట్లు సాధించాం. కానీ ఎక్కువగా బౌండరీలు సమర్పించుకున్నాం. షామర్ జోసెఫ్ మాకు సానుకూలంశం. అతను వేగంగా బంతులు సంధిస్తున్నాడు. తొలి మ్యాచ్ ఆడుతునే సమయంలో ఆతృతలో ఉంటాం. షామర్ కాస్త ఎక్కువగా ఉన్నాడు. వేగవంతమైన బంతులు వేసే ప్రయత్నంలో ఉన్నాడు. సరైన ప్రదేశాల్లో కూడా బౌలింగ్ చేశాడు. కానీ నిలకడగా బౌలింగ్ చేసేలా అతను సాధన చేయాల్సి ఉంది'' అని కేఎల్ రాహుల్ తెలిపాడు. తొలి ఓవర్ వేసిన షామర్ వైడ్స్, నోబాల్‌తో కలిపి పది బంతులు వేసి 22 పరుగులు ఇచ్చాడు. ఓవరాల్‌గా నాలుగు ఓవర్లు వేసిన షామర్ 47 పరుగులు సమర్పించుకున్నాడు.

Story first published: Sunday, April 14, 2024, 19:52 [IST]
Other articles published on Apr 14, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+