ఐపీఎల్‌లో మరో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనుంది. ఈ సీజన్‌లో జోరు మీదున్న ఇరు జట్లు గత మ్యాచ్‌లో ఓటమిపాలయ్యాయి. మొదటిసారి 160+ స్కోరును లక్నో కాపాడుకోలేకపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పరాజయాన్ని చవిచూసింది.
మరోవైపు హ్యాట్రిక్ విజయాలతో ఊపు మీదున్న కేకేఆర్.. సీఎస్కే చేతిలో కంగుతింది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలుపు బాట పట్టాలని లక్నో, కోల్‌కతా జట్లు కసిగా బరిలోకి దిగుతున్నాయి. ఈ సీజన్‌లో అయిదు మ్యాచ్‌లు ఆడిన లక్నో మూడు విజయాలతో నాలుగో స్థానంలో, అలాగే నాలుగు మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ ఆరు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

ఐపీఎల్‌లో ఇప్పటివరకు లక్నో, కోల్‌కతా మూడు సార్లు తలపడ్డాయి. మూడింట్లోనూ లక్నో పైచేయి సాధించింది. మూడు మ్యాచ్‌ల్లోనూ లక్ సూపర్ జెయింట్స్ మొదట బ్యాటింగ్ చేసింది. క్రమంగా ఓటమి అంతరాన్ని కేకేఆర్ తగ్గించుకుంది. కాగా, ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ యువ పేస్ సంచలనం షామర్ జోసెఫ్ లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేయనున్నాడు
కాగా, టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. సొంతమైదానంలో ఆడటం ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుందని కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. తొలుత బ్యాటింగ్ చేయాలనుకోవడం వల్ల రింకూ సింగ్ తుదిజట్టులో లేడని శ్రేయస్ పేర్కొన్నాడు. అతడి స్థానంలో హర్షిత్ రాణా వచ్చాడని అన్నాడు. ఛేజింగ్‌లో రింకూ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతాడని తెలిపాడు. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. దేవదత్ పడిక్కల్, నవీనుల్ హక్ స్థానంలో దీపక్ హుడా, షామర్ జోసెఫ్ జట్టులోకి వచ్చారని వివరించాడు.
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, దీపక్ హుడా, మార్కస్ స్టొయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్య, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, షామర్ జోసెఫ్, మోహ్సిన్ ఖాన్.
కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రఘువంశీ, రసెల్, రమణ్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా.