న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రధాని మోదీని ప్రశంసించిన పాక్ మాజీ పేసర్

Shoaib Akhtar Says Lockdown is a great decision by PM Narendra Modi
Shoaib Akhtar Praises PM Modi

కరాచీ: భారత ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రశంసల జల్లు కురిపించాడు. కరోనా సంక్షోభ సమయంలో మోదీ తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయం చాలా గొప్పదని కొనియాడాడు. కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత్‌లో లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఆదివారం హలో యాప్ వేదికగా లైవ్ సెషన్ నిర్వహించిన ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. తన జీవితంలో కూడా కష్టపడకుండా ఏది లభించలేదని ఈ వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్ తెలిపాడు.

 ప్రపంచకప్ డౌటే..

ప్రపంచకప్ డౌటే..

కరోనా మహమ్మారి కారణంగా క్రీడా రంగం తీవ్రంగా నష్టపోతుందని అక్తర్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ కూడా జరిగే సూచన కనిపించడం లేదన్నాడు. రాబోయే ఆరు నెలలు క్రీడా రంగానికి అత్యంత గడ్డు రోజులని తెలిపాడు. భారత్-పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సిరిస్ నిర్వహించడానికి ఇదే సరైన సమయమని మరోసారి తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఇఫ్తార్ సమయంలో ఈ మహమ్మారి నుంచి త్వరగా కోలుకునేందుకు యావత్ ప్రపంచం ఎదురు చూస్తోందన్నాడు. అభిమానులను పెంచుకునేందుకు తానేమీ భారతీయులను ప్రశంసించడం లేదని చెప్పిన అక్తర్.. సరిహద్దులు ఉన్నప్పటికీ తాను అందరినీ ప్రేమిస్తున్నానని చెప్పుకొచ్చాడు.

సచిన్‌ను కవ్వించొద్దు.. లేకుంటే బాధపడుతావని హెచ్చరించాడు: బ్రెట్ లీ

సచిన్ గ్రేట్..

సచిన్ గ్రేట్..

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఎప్పుడూ స్లెడ్జింగ్‌ పట్ల ఆసక్తి చూపలేదని, అతనో గొప్ప క్రికెటరని అక్తర్ కొనియాడాడు. ఇక రాహుల్ ద్రవిడ్ కూడా సచిన్‌లాంటి ఉన్నతమైన ఆటగాడేనని ఈ పాక్ మాజీ పేసర్ చెప్పుకొచ్చాడు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై కూడా అక్తర్ ప్రశంసల జల్లు కురిపించాడు. గ్రెగ్ చాపెల్ ఎపిసోడ్ తర్వాత దాదా కోలుకున్న విధానం... ఆట అనంతరం కామెంటేటర్‌ నుంచి బీసీసీఐ అధ్యక్షుడిగా ఎదిగిన తీరు అభినందనీయమన్నాడు. భారత క్రికెట్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఘన వీడ్కోలు అందుకునేందుకు అన్ని విధాలా అర్హుడని అక్తర్ అభిప్రాయపడ్డాడు.

 రోహిత్ నా ఫేవరేట్ బ్యాట్స్‌మన్

రోహిత్ నా ఫేవరేట్ బ్యాట్స్‌మన్

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల గురించి ఓ అభిమాని ప్రశ్నించగా.. వ్యక్తిగతంగా తాను రోహిత్ శర్మ అభిమానని, విరాట్ కోహ్లీ ప్రపంచ శ్రేణి ఆటగాడని ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ సమాధానమిచ్చాడు. ‘రోహిత్ శర్మ ఓ క్లాస్ ప్లేయర్. వన్డేల్లో అతను డబుల్ సెంచరీ సాధించడం నాకు ఏ మాత్రం ఆశ్చర్యపరచలేదు. రోహిత్‌తో ఓ సారి నువ్వు గొప్ప బ్యాట్స్‌మన్.. మంచి టైమింగ్ ఉందని చెప్పా.'అని తెలిపాడు. కోహ్లీని ఎలా ఔట్ చేస్తావనే ప్రశ్నకు.. రౌండ్ ద వికెట్‌కు బౌన్సర్ సంధించి కోహ్లీని పెవిలియన్‌కు చేరుస్తానన్నాడు. అతనితో చాలా దూకుడుగా వ్యవహరిస్తానన్నాడు. ఇక షమీ, బుమ్రాల బౌలింగ్ కూడా తనకు నచ్చుతుందన్నాడు.

6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టిన తర్వాత స్టువర్ట్ బ్రాడ్ తండ్రి యూవీతో ఏమన్నాడంటే.?

ఉమ్మి వద్దని ఎప్పుడో చెప్పా..

ఉమ్మి వద్దని ఎప్పుడో చెప్పా..

కరోనా వైరస్ నేపథ్యంలో బంతి స్వింగ్ కోసం ఉపయోగించే ఉమ్మిని ఇక వాడరాదని, దానికి ప్రత్యమ్నాయంగా టాంపరింగ్‌ను అనుమతించాలనే చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై అక్తర్ మాట్లాడుతూ.. ఉమ్మిని వాడవద్దని, ఆటగాళ్లు ఇన్‌ఫెక్షన్ గురువుతారని ఇప్పటికే ఫిర్యాదు చేశానన్నాడు. అలా అని వాసెలిన్‌ను క్రికెట్‌లో ఎప్పటికీ అనుమతించరని స్పష్టం చేశాడు. తన టాప్-5 బ్యాట్స్‌మన్ 1.బాబర్ ఆజమ్, 2. విరాట్ కోహ్లీ, 3. రోహిత్ శర్మ, 4. జోరూట్, 5. విలియమ్సన్ అని తెలిపాడు. ఇక్ ఆల్‌టైమ్ ఫేవరేట్ మాత్రం షేన్ బాండ్ అని చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, April 27, 2020, 10:33 [IST]
Other articles published on Apr 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X