For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్

లక్నో సూపర్ జెయింట్స్ టాప్-4లోకి దూసుకెళ్లింది. ఎనిమిది మ్యాచ్‌ల్లో అయిదింట్లో నెగ్గి సత్తాచాటుతోంది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో సీఎస్కేను ఎల్‌ఎస్‌జీ ఓడించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నాలుగు వికెట్లకు 210 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (108*; 60 బంతుల్లో, 12x4, 3x6) అజేయశతకంతో చెలరేగాడు. అతనికి తోడుగా శివమ్ దూబె (66; 27 బంతుల్లో, 3x4, 7x6) కూడా సత్తాచాటాడు. అనంతరం ఛేదనలో లక్నో 19.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. స్టొయినిస్ (124*; 63 బంతుల్లో, 13x4, 6x6) విధ్వంసం సృష్టించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. నికోలస్ పూరన్ (34; 15 బంతుల్లో, 3x4, 2x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

CSK vs LSG Impact player gives you depth and that gives you more freedom- KL Rahul

చెపాక్‌లో పరుగుల పరంగా అత్యధిక విజయవంతమైన ఛేదన ఇదే. అంతకుముందు 2020లో ఆర్సీబీపై సీఎస్కే చేసిన 206 పరుగుల ఛేజింగే చెపాక్‌లో టాప్. కాగా, ఈ రికార్డు ఛేదన అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడాడు. తమ జట్టు ప్రదర్శన గురించి వివరించాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌తో ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకున్నామని, భారీ ఛేదన సాధించామని రాహుల్ తెలిపాడు.

''ఓ దశలో ఛేజింగ్‌లో మేం వెనకపడ్డాం అనిపించింది. కానీ విజయతీరాలకు చేరడం ఎంతో సంతోషాన్నిస్తుంది. గత మ్యాచ్‌లో సీఎస్కేపై సాధించిన విజయాన్ని కొనసాగించాలనే ఆలోచన ధోరణీతో అడుగుపెట్టలేదు. ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకున్నాం. ఇక్కడ భిన్నమైన పరిస్థితులు. అయితే సీఎస్కే శుభారంభాన్ని చేశారు. మా బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. ఇది 210 పరుగులు చేసే వికెట్ అని నేను భావించట్లేదు. కానీ వాళ్లు బాగా బ్యాటింగ్ చేశారు''

''ఇక మా విషయానికొస్తే.. క్రెడిట్ మొత్తం స్టొయినిస్‌కు ఇవ్వాలి. అతని ఆటను ఎంతో ఆస్వాదించా. స్టొయినిస్ కేవలం పవర్ హట్టింగ్ చేయలేదు. స్మార్ట్ బ్యాటింగ్ చేశాడు. అతన్ని వన్‌డౌన్‌లో పంపించడానికి కారణం ధైర్యవంతమైన జట్టుగా ఉండాలని భావించాం. ప్రత్యర్థి మైదానాల్లో, సొంత మైదానంలో గత కొన్ని మ్యాచ్‌ల్లో మేం 170 పరుగులను దాటలేకపోయాం. దీంతో టాప్-3లో ఓ పవర్ హిట్టర్ ఉండాలనుకున్నాం. అంతేగాక టీ20 క్రికెట్ చాలా మారిపోయింది. 170-180 పరుగులు సరిపోవట్లేదు. పవర్‌ప్లేలో విధ్వంసకరంగా ఆడాలి. ఇంపాక్ట్ ప్లేయర్ లోతైన బ్యాటింగ్ ఆర్డర్‌కు ఉపయోగపడుతుంది. బ్యాటర్లకు పూర్తి స్వేచ్ఛను ఇస్తుంది'' అని రాహుల్ పేర్కొన్నాడు.

Story first published: Wednesday, April 24, 2024, 8:41 [IST]
Other articles published on Apr 24, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+