న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘ఖేల్‌రత్న’కు నీరజ్ చోప్రా.. ‘అర్జున’కు ద్యుతీచంద్‌

AFI nominates javelin thrower Neeraj Chopra for Khel Ratna Award

న్యూఢిల్లీ: భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ఈసారి కూడా 'రాజీవ్‌ ఖేల్‌రత్న' బరిలో నిలిచాడు. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌ఐ) 2018 కామన్వెల్త్‌ గేమ్స్, ఆసియా క్రీడల చాంపియన్‌ అయిన నీరజ్‌ను అత్యున్నత క్రీడా పురస్కారానికి వరుగా మూడో ఏడాదీ నామినేట్‌ చేసింది. 2016లో ప్రపంచ జూనియర్‌ అథ్లెటిక్స్‌ అండర్‌-20 చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం నెగ్గిన నీరజ్‌ 2017 ఆసియా చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం దక్కించుకున్నాడు.

మూడోసారి ముచ్చట తీరెనా..?

మూడోసారి ముచ్చట తీరెనా..?

గత రెండేళ్లుగా నీరజ్‌ను ఏఎఫ్‌ఐ నామినేట్‌ చేస్తున్నప్పటికీ ‘ఖేల్‌రత్న' వరించడం లేదు. 22 ఏళ్ల నీరజ్‌కు 2018లో ‘అర్జున అవార్డు' దక్కింది. మహిళా స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌తో పాటు ఆసియా క్రీడల స్వర్ణ విజేతలు అర్పిందర్‌ సింగ్‌ (ట్రిపుల్‌ జంప్‌), మన్‌జీత్‌ సింగ్‌ (800 మీటర్ల పరుగు), మిడిల్‌ డిస్టెన్స్‌ రన్నర్‌ పి.యు.చిత్రలను ‘అర్జున' అవార్డుకు సిఫారసు చేసింది. డిప్యూటీ చీఫ్‌ కోచ్‌ రాధాకృష్ణన్‌ నాయర్‌ను ‘ద్రోణాచార్య', కుల్దీప్‌ సింగ్‌ భుల్లర్, జిన్సీ ఫిలిప్‌లను ధ్యాన్‌చంద్‌ జీవిత సాఫల్య పురస్కారం కోసం ఏఎఫ్‌ఐ ప్రతిపాదించింది.

రోహిత్ శర్మ కన్నా కోహ్లీనే బెటర్ బ్యాట్స్‌మన్: ఆసీస్ మాజీ క్రికెటర్

అర్జున అవార్డు రేసులో బుద్దా అరుణా రెడ్డి, సుమిత్ రెడ్డి

అర్జున అవార్డు రేసులో బుద్దా అరుణా రెడ్డి, సుమిత్ రెడ్డి

ప్రముఖ జిమ్నాస్టిక్‌ క్రీడాకారిణి బుద్దా అరుణా రెడ్డి, బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ ఆటగాడు సుమిత్‌ రెడ్డి పేర్లను తెలంగాణ సర్కార్‌ అర్జున అవార్డుకు సిఫారసు చేసింది. అరుణ 2018లో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన జిమ్నాస్టిక్‌ వరల్డ్‌క్‌పలో వాల్ట్‌ విభాగంలో కాంస్య పతకం సాధించి సంచలనం సృష్టించగా, సుమిత్‌ పలు అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీల్లో పతకాలు కొల్లగొట్టాడు. వీరితో పాటు టెన్నిస్‌ కోచ్‌ సీవీ నాగరాజ్‌, దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ కోచ్‌ నీతను ద్రోణాచార్య అవార్డుకు, ఆర్చరీ కోచ్‌ వర్ధినేని ప్రణిత (వరంగల్‌)ను ధ్యాన్‌చంద్‌ జీవిత సాఫల్య పురస్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

అవార్డుల దరఖాస్తు గడువు పెంపు

అవార్డుల దరఖాస్తు గడువు పెంపు

ఈ ఏడాది క్రీడా పురస్కారాల కోసం అర్హులైన అథ్లెట్లు దరఖాస్తులను పంపేందుకు గడువు తేదీని కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ పెంచింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం దరఖాస్తులు పంపేందుకు ఆఖరు తేదీ బుధవారం (జూన్‌ 3)తో ముగిసింది. అయితే, కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో ఈ గడువు తేదీని ఈనెల 22 వరకు పెంచుతున్నట్టు క్రీడాశాఖ బుధవారం ప్రకటించింది. అలాగే.. సమాఖ్యల నుంచి సిఫారసు లేకుండా సొంతంగా తమ పేర్లను ప్రతిపాదించుకునేందుకు కూడా అథ్లెట్లకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది.

మా నాన్నను ఎగతాళి చేశారు: హార్దిక్ పాండ్యా

ప్రణయ్‌ ఫైర్..

ప్రణయ్‌ ఫైర్..

బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్‌)పై స్టార్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ అసంతృప్తి వెళ్లగక్కాడు. ఈ ఏడాదీ తనను ‘అర్జున'కు నామినేట్‌ చేయకపోవడంపై ఈ కేరళ ప్లేయర్‌ ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డాడు. ‘అవార్డుల నామినేషన్లలో పాత కథే! కామన్వెల్త్‌ గేమ్స్, ఆసియా చాంపియన్‌షిప్‌లలో పతకాలు నెగ్గిన షట్లర్‌ను విస్మరిస్తారు. దేశం తరఫున ఇలాంటి మెగా ఈవెంట్స్‌లో కనీసం పోటీపడని ఆటగాడినేమో నామినేట్‌ చేస్తారు. ‘అవార్డులు ఈ దేశంలో ఓ నవ్వులాటగా మారాయి.' అని ట్వీట్‌ చేశాడు.

Story first published: Thursday, June 4, 2020, 9:44 [IST]
Other articles published on Jun 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X