న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ శర్మ కన్నా కోహ్లీనే బెటర్ బ్యాట్స్‌మన్: ఆసీస్ మాజీ క్రికెటర్

Brad Hogg picks Virat Kohli as better white-ball cricketer ahead of Rohit Sharma

సిడ్నీ: ప్రస్తుత భారత జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భారత్ తరఫున వారు చేసిన పరుగులే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. తమ అద్భుతమైన ఆటతో చిరస్మరణీయ విజయాలందిస్తున్న ఈ ఇద్దరు.. జట్టు సారథ్య బాధ్యతలను కూడా సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. కోహ్లీ గైర్హాజరీలో సారథ్యం వహించిన రోహిత్ అద్భుత విజయాలందించాడు. మైదానంలో సమ ఉజ్జీలుగా రాణిస్తున్న ఈ ఇద్దరిలో గొప్ప ఎవరనే చర్చను వారి అభిమానులు తరుచూ తెరపైకి తెస్తుంటారు. కోహ్లీ విఫలమైనప్పుడల్లా జట్టు సారథ్య బాధ్యతలను రోహిత్‌కు ఇవ్వాలని అతని అభిమానులు కోరుతుంటారు. ఐపీఎల్‌లో రోహిత్ విజయవంతమైన కెప్టెన్ అని పరిమిత ఓవర్ల సారథ్య బాధ్యతలను అతనికి అప్పగించాలని గతకొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు.

విరాట్ కోహ్లీనే బెటర్..

అయితే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో రోహిత్ కన్నా విరాట్ కోహ్లీనే గొప్ప బ్యాట్స్‌మన్ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ తెలిపాడు. ఈ ఇద్దరిని పోల్చడం సరైంది కాదని, భారత జట్టులో వారు పోషించే పాత్రలు పూర్తిగా భిన్నమైనవని చెప్పుకొచ్చాడు. కాకపోతే కోహ్లీనే గొప్ప అని చెప్పడానికి అతను ఛేజింగ్‌లో స్థిరంగా రాణించడమే కారణమని హాగ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా వెల్లడించాడు.

అందుకే సోషల్ మీడియాకు ధోనీ దూరంగా ఉన్నాడు: సాక్షి

పోల్చడం సరైంది కాదు..

పోల్చడం సరైంది కాదు..

పవర్‌ప్లేలో ప్రత్యర్థులపై ఇద్దరూ ఆధిపత్యం చెలాయిస్తారని. కోహ్లీ మాత్రం పరిస్థితులకు అనుగునంగా కొంచెం బాధ్యతాయుతంగా ఆడుతాడన్నాడు. ‘రోహిత్ కన్నా విరాట్ బెటర్. ఎందుకంటే భారీ లక్ష్య చేధనలో కూడా కోహ్లీ స్థిరంగా ఆడుతాడు. ఎలాంటి ఒత్తిడికి గురవ్వడు. జట్టులో ఈ ఇద్దరు పోషిస్తున్న పాత్రలు విభిన్నమైనందున వారిని పోల్చడం సరైంది కాదు. ఫీల్డ్ ఆంక్షలు ఉన్నప్పుడు కొత్త బంతితో బౌలింగ్ చేసే బౌలర్లపై దూకుడుగా ఆడే బాధ్యత రోహిత్‌ది. నిదానంగా పరిస్థితులకు దగ్గట్టు ఆడుతూ కడ వరకు క్రీజులో ఉండటం విరాట్ బాధ్యత. కాబట్టి ఒకరికొకరిని పోల్చడం ఏ మాత్రం సరైంది కాదు. 'అని హగ్ తెలిపాడు. ఇప్పటికే కోహ్లీ, రోహిత్ అద్భుత రికార్డులు తమ పేరిట లిఖించుకున్నారు. ముఖ్యంగా వన్డేల్లో విరాట్ 43 సెంచరీలతో దూసుకుపోతుండగా.. రోహిత్ అత్యుత్తమ ఓపెనర్‌గా గుర్తింపు పొందాడు. తన విధ్వంసక ఆటతో హిట్ మ్యాన్ ట్రిపుల్ డబుల్ సెంచరీ బాదాడు. ఇక టీ20ల్లో 4 శతకాలు నమోదు చేశాడు.

ఆల్‌టైమ్ టెస్ట్ టీమ్‌లో కోహ్లీకి నో ఛాన్స్

ఆల్‌టైమ్ టెస్ట్ టీమ్‌లో కోహ్లీకి నో ఛాన్స్

ఇక రోహిత్‌తో పోలుస్తూ కోహ్లీని కొనియాడిన బ్రాడ్ హాగ్.. రెండు వారల క్రితం ప్రకటించిన ఆల్‌టైమ్ అత్యుత్తమ టెస్ట్ జట్టులో అవకాశం ఇవ్వలేదు. కానీ రోహిత్‌ను ఎంపిక చేశాడు. విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేకపోవడంతోనే తన జట్టులోకి తీసుకోలేదనే హాగ్‌ వివరణ ఇచ్చాడు. 'కోహ్లీని జట్టులో తీసుకోలేకపోవడంపై ప్రతీ ఒక‍్కరూ ప్రశ్నించే అవకాశం ఉంది. గత 15 టెస్టు ఇన్నింగ్స్‌ చూస్తే.. కేవలం నాలుగుసార్లు మాత్రమే కోహ్లీ 31 పరుగులు మించి చేశాడు. ప్రస్తుత ఫామ్‌ను దృష్టిలో పెట్టుకొని మాత్రమే నా జట్టులో చోటు కల్పించలేదు. మయాంక్‌ కవర్‌ డ్రైవ్స్‌ అంటే నాకు ఇష్టం. రోహిత్‌ శర్మను ఎంపిక చేయడానికి ఆలోచించా. భారత్‌లో టెస్టు క్రికెట్‌లో రోహిత్‌ సుమారు 90పైగా సగటు కల్గి ఉన్నాడు. అందుచేత రోహిత్‌కు నా తుది జట్టులో చోటు దక్కింది' అని హాగ్‌ తెలిపాడు. బ్రాడ్ హాగ్ ఆల్ టైం ఐపీఎల్‌ జట్టును కూడా ప్రకటించాడు.

బ్రాడ్ హాగ్ వరల్డ్‌ టెస్టు ఎలెవన్:

బ్రాడ్ హాగ్ వరల్డ్‌ టెస్టు ఎలెవన్:

రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌, అజింక్యా రహానే, మహ్మద్‌ షమీ, మార్నస్ లబూషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, ప్యాట్‌ కమిన్స్‌, నాధన్‌ లయాన్, బాబర్‌ అజామ్, క్వింటన్ డీకాక్, నీల్‌ వాగ్నర్‌.

బ్రాడ్ హాగ్ ఆల్ టైం ఐపీఎల్‌ జట్టు:

రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోనీ, సునీల్ నరైన్, రషీద్ ఖాన్, మునాఫ్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా.

లాక్‌డౌన్ తర్వాత.. ధోనీ ఏం ప్లాన్ చేసాడో తెలుసా?!!

https://telugu.mykhel.com/cricket/sakshi-reveals-post-lockdown-vacation-plans-with-ms-dhoni-028413.html

Story first published: Wednesday, June 3, 2020, 12:41 [IST]
Other articles published on Jun 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X