నావల్ల మా ఫ్యామిలీకి చెడ్డ పేరు వచ్చింది.. అప్పుడే నా కెరీర్ ముగిసిందనుకున్నా: హార్దిక్ పాండ్యా

న్యూఢిల్లీ: 'కాఫీ విత్ కరణ్ షో' వివాదం తనకెన్నో విలువైన పాఠాలు నేర్పించిందని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్‌కు చెందిన ఆ షోకి సహచర క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో కలిసి పాల్గొన్న పాండ్యా.. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. పాండ్యా చేసిన వ్యాఖ్యల పట్ల అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. దీంతో బీసీసీఐ ఈ బరోడా క్రికెటర్‌పై తాత్కలిక నిషేధం కూడా విధించింది.
తన కెరీర్‌లోనే అత్యంత గడ్డుకాలంగా మిగిలిన ఆ షో వివాదంపై పాండ్యా స్పందించాడు. ప్రముఖ కామెంటేటర్ హర్షాబోగ్లే హోస్ట్‌గా క్రిక్ బజ్ నిర్వహించిన లైవ్ సెషన్‌లో ఈ విధ్వంసక ఆల్‌రౌండర్ పాల్గొన్నాడు.

నా తప్పును ఒప్పుకున్నా..
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ షో వివాదం కారణంగా తమ కుటుంబ సభ్యులను తిట్టారని, అది తనను చాలా బాధించిందన్నాడు. ఇక తాను చేసిన తప్పును మనస్పూర్తిగా అంగీకరించానన్నాడు. ‘ఆ వివాదం చోటు చేసుకున్నప్పుడు.. తప్పిదాన్ని స్వీకరించి సరిచేసుకోవాలని నా అంతరాత్మకు చెప్పుకున్నా. ఆ తప్పును అంగీకరించకుంటే అది ఇప్పటికీ నన్ను వెంటాడేది. టీవీలో నా గురించి మరో షో వచ్చేది. ఈ ఘటనతో నేను మరింత వివేకవంతంగా మారాను. 'అని తెలిపాడు.

నేనో ఫ్యామిలీ మ్యాన్..
ఇక తాను పూర్తిగా కుటుంబ సభ్యుడినని, వారే లేకుంటే హార్దిక్ అనే వాడు ఉండేవాడు కాదని ఈ స్టార్ ఆల్‌రౌండర్ స్పష్టం చేశాడు. ‘నేనో ఫ్యామిలీ మ్యాన్. కుటుంబం లేకుంటే నేను లేను. నా ఫ్యామిలే నా వెన్నుముక. వెనుక వారున్నారు కాబట్టే హార్దిక్ పాండ్యాను అందరూ చూడగలుగుతున్నారు. నేను మానసికంగా బలంగా, సంతోషంగా ఉండటానికి వారే కారణం.'అని చెప్పుకొచ్చాడు.

మా నాన్నను ఎగతాళి చేశారు..
ఇక కాఫీ విత్ కరణ్ షోలో తాను చేసిన తప్పిదం కారణంగా తన కుటుంబం తీవ్ర వేధింపులకు గురైందని, అది తనను చాలా బాధించిందని ఈ బరోడా క్రికెటర్ తెలిపాడు. ‘నా కుటుంబం తీవ్ర వేధింపులకు గురైంది. ఆ సంఘటన గురించి నా తండ్రి ఒక ఇంటర్వ్యూ ఇస్తే.. ప్రజలంతా ఎగతాళి చేశారు. నేను చేసిన తప్పిదం కారణంగా నా కుటుంబం తీవ్ర సమస్యలను ఎదుర్కొంది. అది నన్ను తీవ్రంగా కలిచివేసింది. 'అని పాండ్యా ఆవేదన వ్యక్తం చేశాడు.

నా కెరీర్ ముగిసిందనుకున్నా..
ఇక ఆసియాకప్-2018లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా వెన్ను గాయానికి గురై టోర్నీ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ గాయం కారణంగా తన కెరీర్ ముగిసిందని, అదే తన చివరి మ్యాచ్ అనుకున్నానని తాజాగా పాండ్యా వెల్లడించాడు. ‘నిజాయితీగా చెబతున్నా నా కెరీర్ ముగిసిందనుకున్నా. ఎందుకంటే అంతకు ముందెప్పుడు నేను అలాంటి వెన్ను గాయానికి గురవ్వలేదు. 10 నిమిషాలు కదల్లేకపోయా. తర్వాత నొప్పి ఏ మాత్రం తగ్గలేదు. కొన్ని రోజులు తర్వాత కోలుకోవడం మొదలైంది. గాయం కాకముందే విశ్రాంతినివ్వడంతో ఆసియాకప్
ఆఖరిదిగా భావించా'అని పాండ్యా తెలిపాడు.

మహిళలను కించపరిచే వ్యాఖ్యలు..
‘కాఫీ విత్ కరణ్' షోలో హార్ధిక్ పాండ్యా లవ్‌స్టోరీ గురించి కరణ్ జోహార్ అడగ్గా.. తాను ఎంత మందితో శృంగారంలో పాల్గొన్నది, పార్టీల్లో అమ్మాయిల్ని తాను చూసే విధానంపై అభ్యంతరకరంగా మాట్లాడాడు. రాహుల్ కూడా తన జేబులో కండోమ్ ప్యాకెట్ గురించి వివరిస్తూ తన తండ్రి ‘ఫర్వాలేదు రక్షణ కవచం వాడుతున్నావు' అంటూ ప్రశంసించాడని వివాదాస్పదరీతిలో చెప్పుకొచ్చాడు. మహిళలను కించపరిచే విధంగా ఉన్న ఈ వ్యాఖ్యల పట్ల అప్పట్లో తీవ్ర దూమారం రేగింది. కుర్రాళ్లకు ఆదర్శంగా ఉండాల్సిన క్రికెటర్లు ఇలా వ్యవహరించడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి.
ఆకాష్ చోప్రా ఈతరం వన్డే ఎలెవన్.. కోహ్లీకి దక్కని కెప్టెన్సీ, బుమ్రాకు నో చాన్స్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications