న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. న్యూజిలాండ్‌తో బుధవారం కోల్‌కతా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్లో 33 బంతుల్లో సెంచరీ చేయడం ద్వారా ఫిన్ అలెన్ ఈ ఫీట్ సాధించాడు. అంతేకాకుండా టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే నాకౌట్ మ్యాచ్‌ల్లో సెంచరీ బాదిన తొలి బ్యాటర్‌గా కూడా ఫిన్ అలెన్ చరిత్రకెక్కాడు.
ఈ క్రమంలో అతను తిలక రత్నే దిల్షాన్ పేరిట ఉన్న రికార్డ్‌ను అధిగమించాడు. 2009 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో వెస్టిండీస్‌పై శ్రీలంకకు చెదిన దిల్షాన్ 96 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు పొట్టి ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉండగా.. ఫిన్ అలెన్ తాజా శతకంతో బద్దలుకొట్టాడు.

100 - ఫిన్ అలెన్ వర్సెస్ సౌతాఫ్రికా, కోల్‌కతా, 2026 సెమీ-ఫైనల్*
96 - తిలకరత్న దిల్షాన్ వర్సెస్ వెస్టిండీస్, ది ఓవల్, 2009 సెమీ-ఫైనల్*
89 - విరాట్ కోహ్లీ వర్సెస్ వెస్టిండీస్, ముంబై వాంఖడే స్టేడియం, 2016 సెమీ-ఫైనల్*
86 - అలెక్స్ హేల్స్ వర్సెస్ ఇండియా, అడిలైడ్, 2022 సెమీ-ఫైనల్*
85 - మార్లన్ శామ్యూల్స్ వర్సెస్ ఇంగ్లాండ్, కోల్‌కతా, 2016 ఫైనల్*
85 - కేన్ విలియమ్సన్ వర్సెస్ ఆస్ట్రేలియా, దుబాయ్, 2021 ఫైనల్
ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన బ్యాటర్‌గానూ ఫిన్ అలెన్ నిలిచాడు. ఈ క్రమంలోనే క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. 2016లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్‌పై 47 బంతుల్లో క్రిస్ గేల్ సెంచరీ చేశాడు. పొట్టి ప్రపంచకప్‌లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్‌గా ఉండగా.. ఫిన్ అలెన్ కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాది గేల్ రికార్డ్ బద్దలు కొట్టాడు.
అంతర్జాతీయ టీ20ల్లో న్యూజిలాండ్ తరఫున కూడా ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. 2020లో వెస్టిండీస్‌పై గ్లేన్ ఫిలిప్స్ 46 బంతుల్లో సెంచరీ చేయగా.. ఫిన్ అలెన్ తాజా శతకంతో అధిగమించాడు. అంతేకాకుండా ఒక పూర్తి స్థాయి సభ్యదేశంపై టీ20ల్లో నమోదైన అత్యంత వేగవంతమైన సెంచరీ కూడా ఇదే.
ఈ మ్యాచ్‌లో ఫిన్ అలెన్ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ బాదిన బ్యాటర్‌గా ఫిన్ అలెన్ నిలిచాడు. ఈ క్రమంలో యువరాజ్ సింగ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో డర్బన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ 20 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. గత 19 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఈ రికార్డ్‌ను ఫిన్ అలెన్ తాజా మ్యాచ్‌తో అధిగమించాడు. ఫిన్ అలెన్ శతకంతో ఈ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలిచిన న్యూజిలాండ్.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. సౌతాఫ్రికా పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది.