For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సూర్య నా కొడుకు లాంటివాడు.. అది ఎటకారం కాదు: సంజూ శాంసన్ తండ్రి

టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ శాంసన్ అండగా నిలిచారు. సూర్య తన కొడుకు లాంటి వాడని, సంజూను ఉద్దేశించి అతను చేసిన వ్యాఖ్యలు ఎటకారం కాదని స్పష్టం చేశారు. సంజూ శాంసన్‌కు సూర్య కుమార్ యాదవ్, గంభీర్ ఇచ్చినటు వంటి మద్దతు మరే కెప్టెన్, కోచ్ ఇవ్వలేదని అభిప్రాయపడ్డారు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ తరహా సూపర్-8 పోరులో సంజూ శాంసన్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 97 పరుగులతో అజేయంగా నిలిచిన సంజూ శాంసన్.. ఒంటి చేత్తో టీమిండియాను విజేతగా నిలబెట్టాడు. అతని విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో 196 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో సంజూ శాంసన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఎటకారం చేసినోడు సలామ్ కొట్టాడు..

ఈ మెగా టోర్నీకి ముందు పేలవ ప్రదర్శనతో తుది జట్టులో చోటు కోల్పోయిన సంజూ శాంసన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించడంతో సంజూ బెంచ్‌కే పరిమితమయ్యాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయడంతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై విమర్శలు వచ్చాయి. తుది జట్టులో ఆడించే విషయంలో సంజూను ఎటకారం చేసిన సూర్య.. ఇప్పుడు అతనికి వంగి సలామ్ కొడుతున్నాడని కొందరు నెటిజన్లు పోస్ట్‌లు పెట్టారు.

సౌతాఫ్రికాతో సూపర్-8 పోరుకు ముందు మీడియా సమావేశంలో సంజూ శాంసన్‌ను తక్కువ చేసేలా సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు. అభిషేక్ శర్మ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ కావడంతో తుది జట్టులో సంజూను ఆడిస్తున్నారా? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. అందుకు ఎవరీ స్థానంలో ఆడించాలి? అభిషేక్ శర్మను పక్కన పెట్టాలా? అని ఎటకారంగా సూర్య ఎదురు ప్రశ్నించాడు. తిలక్ వర్మ స్థానంలో ఆడించవచ్చు కదా? అని సదరు రిపోర్టర్ సూచించగా.. తిలక్‌ను తప్పించాలా? అని నవ్వుతూ బదులిచ్చాడు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

Suryakumar is Like a Son Sanju Samson s Father Viswanath Emotional Ahead of IND vs ENG Semi-Final

బ్యాట్‌తోనే బదులు..

భారత ఓపెనర్లు ఇద్దరూ లెఫ్టార్మ్ బ్యాటర్లు కావడం.. ప్రత్యర్థి జట్లు ఆఫ్ స్పిన్నర్లతో ఎదురు దాడికి దిగుతుండటంతో కుడిచేతి వాటం బ్యాటర్ అయిన సంజూ శాంసన్ ఆడించడం టీమిండియాకు మేనేజ్‌మెంట్‌కు తప్పలేదు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న సంజూ శాంసన్... కీలక మ్యాచ్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో సూర్య ఎటకారంపై నెటిజన్లు మండిపడ్డారు.

సూర్య తప్పు లేదు..

అయితే సంజూ శాంసన్ తండ్రి మాత్రం ఈ విషయంలో సూర్య తప్పులేదని చెప్పుకొచ్చారు. సూర్య ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని, జట్టు సభ్యుల పట్ల అతని మద్దతును, అంకితభావాన్ని కొనియాడారు. 'సూర్య నా కొడుకు లాంటివాడు. అతనికి అహం అనేది అస్సలు లేదు. అతను తన జట్టు సభ్యుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తాడు.

అతను నిజమైన కెప్టెన్. సూర్యకుమార్ సంజుకు ఎంత మద్దతు ఇస్తున్నాడో మాకు తెలుసు. అతని మాటలను అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సూర్య, గంభీర్‌లను మినహాయిస్తే.. మరెవరూ కూడా సంజూ ఇంత మద్దతు ఇవ్వలేదు. సూర్య కూడా నాకు కొడుకు లాంటివాడే’అని విశ్వానథ్ శాంసన్ భావోద్వేగానికి గురయ్యారు.

Story first published: Thursday, March 5, 2026, 10:18 [IST]
Other articles published on Mar 5, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+