Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ట్రోఫీ కంటే గర్ల్‌ఫ్రెండ్ ముద్దుకే క్రేజ్! (వీడియో)

టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా చారిత్రాత్మక విజయానంతరం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సంబరాల్లో మునిగిపోయింది. ఈ గెలుపుతో భారత్ వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలవగా.. స్టేడియంలో ఉన్న వేలాదిమంది అభిమానుల మధ్య స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, తన గర్ల్‌ఫ్రెండ్, మోడల్ మహికా శర్మల మధ్య జరిగిన సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. ఈ రొమాంటిక్ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మైదానంలోనే రొమాంటిక్ డ్యాన్స్, ముద్దు
టీమిండియా విజయం ఖరారైన వెంటనే మహికా శర్మ ఉత్సాహంగా మైదానంలోకి దూసుకొచ్చి హార్దిక్ పాండ్యాను హగ్ చేసుకుంది. ఆ తర్వాత మహికా శర్మ హార్దిక్ బుగ్గపై ముద్దు పెట్టి ఇద్దరూ కలిసి మైదానంలో అందరి ముందు రొమాంటిక్ స్టెప్పులతో డ్యాన్స్ చేశారు. ఈ అపురూప దృశ్యాలను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో ఈ జంటపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వీరిద్దరూ చేతులు పట్టుకుని మైదానంలో నడుస్తున్న ఫోటోలు, వీడియోలు ఫ్యాన్స్‌ను ఎంతగానో అలరిస్తున్నాయి.

Hardik Pandya Celebrates Victory with Girlfriend Mahieka Sharma After T20 World Cup Win Video Viral

మహికా నా లక్కీ ఛార్మ్: హార్దిక్ పాండ్యా
మ్యాచ్ అనంతరం బ్రాడ్‌కాస్టర్లతో మాట్లాడిన హార్దిక్ పాండ్యా.. తన విజయంలో మహికా పాత్రను ప్రశంసించారు. "మహికా నా జీవితంలోకి వచ్చిన తర్వాత, నేను ఆడే ప్రతి టోర్నమెంట్‌లోనూ విజయం సాధిస్తున్నాను. తను నా లక్కీ ఛార్మ్. కష్టపడటం, మౌనంగా ఉండటం, మంచి వ్యక్తిగా జీవించడం ఇవే నా విజయ రహస్యాలు. ఈ ట్రోఫీ నా కఠిన శ్రమకు నిదర్శనం" అని హార్దిక్ పాండ్యా తన సంతోషాన్ని పంచుకున్నాడు.

మహికా ఎమోషనల్ పోస్ట్
హార్దిక్ గెలుపుపై మహికా శర్మ కూడా స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ట్రోఫీతో ఉన్న హార్దిక్ ఫోటోను షేర్ చేస్తూ.. "ది మ్యాన్, ది మిత్, ది లెజెండ్" అంటూ క్రౌన్, భారత జెండా ఎమోజీలను జత చేశారు. వీరిద్దరి ప్రేమాయణంపై అభిమానులు సోషల్ మీడియాలో భారీ ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.

హార్దిక్ పాండ్యా వ్యక్తిగత ప్రస్థానం
25 ఏళ్ల మోడల్, నటి అయిన మహికాతో హార్దిక్ 2025లో డేటింగ్ ప్రారంభించారు. ఈ ఏడాది ఆరంభంలో తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా వారిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను బహిరంగంగా ప్రకటించారు. గతంలో నటాషా స్టాంకోవిక్‌తో విడాకులు తీసుకున్న హార్దిక్, ప్రస్తుతం తన కుమారుడు అగస్త్యను కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు మహికాతో కలిసి హార్దిక్ తన కొత్త జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు.

Story first published: Monday, March 9, 2026, 10:45 [IST]
Other articles published on Mar 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+