ఢిల్లీకి రాజైనా పెళ్లానికి మొగుడే కదా.. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పరిస్థితి కూడా అలానే ఉంది. భారత కెప్టెన్‌గా రెండు ఐసీసీ టైటిళ్లు అందించిన రోహిత్ శర్మకు కోట్లాది అభిమాన గణం ఉంది. మైదానంలో కెప్టెన్‌గా అతని నిర్ణయాలకు తిరుగులేదు. మైదానం బయట అతని మాటకు ఎదురు లేదు. కానీ అందరిలా పెళ్లాం ముందు రోహిత్ శర్మ కూడా సాధారణ మొగుడే. ప్రపంచకప్ గెలిచినా.. కోట్లాది మంది అభిమాన గణం ఉన్నా.. తన సతీమణి రితికా సజ్దే చెప్పిన మాటే వినాలి. కాదు కూడదంటే.. అందరి పెళ్లాల్లానే రితికా కూడా నోటికి పనిచెబుతుంది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ సందర్భంగా రోహిత్ శర్మ, రితికా సజ్దే కీచులాడుకున్న వీడియో వైరల్‌గా మారింది. బౌండరీ లైన్‌పై నిల్చున్న ఈ ఇద్దరూ ఏదో విషయంపై తీవ్ర వాగ్వాదం చేసుకున్నారు. రోహిత్ శర్మ తీవ్ర అసహనంగా కనిపించగా.. రితికా ఏదో అంటూ హిట్‌మ్యాన్‌కు మరింత కోపం తెప్పించింది. సాధారణ మొగుడు పెళ్లాలు కీచులాడుకున్నట్లు ఈ ఇద్దరూ గొడవపడ్డారు. అభిమానులు చూస్తున్నారనే విషయం కూడా మరించి వాగ్వాదానికి దిగారు.

ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఢిల్లీకి రాజైనా పెళ్లానికి మొగుడే కదా..?అని ఒకరంటే.. భాయే కాదు.. ఏ భర్తదైనా ఇదే పరిస్థితి అని మరొకరు, హిట్‌మ్యానే కూడా భార్య బాధితుడేనని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇటీవలే మహేంద్ర సింగ్ ధోనీ కూడా తన సతీమణి గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రపంచంలో తాను ఏ విజయం సాధించినా.. మరెందరితో వాదించి నెగ్గినా.. తన పెళ్లాంతో మాత్రం గొడవపడలేనని స్పష్టం చేశాడు.
అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 255 పరుగుల భారీ స్కోర్ చేయగా.. న్యూజిలాండ్ 159 పరుగులకు ఆలౌటైంది. ఈ గెలుపుతో టీమిండియా మూడో టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడటంతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్‌గా టైటిల్ నిలబెట్టుకున్న జట్టుగా.. సొంతగడ్డపై ట్రోఫీ గెలిచిన టీమ్‌గా చరిత్ర సృష్టించింది.
ఈ మెగా టోర్నీకి రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఫైనల్‌కు రోహిత్‌తో పాటు ఐసీసీ టైటిళ్లు గెలిచిన ధోనీ, కపిల్ దేవ్ కూడా హాజరయ్యారు. మ్యాచ్‌కు ముందు ధోనీతో కలిసి రోహిత్.. టీ20 ప్రపంచకప్‌ను మైదానంలోకి తీసుకొచ్చాడు. భారత విజయానంతరం ఆటగాళ్లతో కలిసి సంబరాలు చేసుకున్నాడు.