For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నోరు ఉంది కదా అని వాగితే ఇలానే ఉంటుంది మరి!

IND vs WI: కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన హై-వోల్టేజ్ పోరులో వెస్టిండీస్‌ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించిన టీమిండియా.. టీ20 ప్రపంచకప్ 2026 సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ విజయంతో భారత్ కేవలం సెమీస్‌కు చేరడమే కాకుండా.. టీమిండియా సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడిన పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ ఆమిర్‌కు చెంపబెబ్బ లాంటి సమాధానం ఇచ్చింది.

ఆ ఒక్క తప్పిదమే మా ఓటమిని శాసించింది: వెస్టిండీస్ కెప్టెన్ఆ ఒక్క తప్పిదమే మా ఓటమిని శాసించింది: వెస్టిండీస్ కెప్టెన్

ఆమిర్ జోస్యానికి భారత్ 'పవర్'ఫుల్ రిప్లై
ఈ ప్రపంచకప్ ప్రారంభానికి ముందు పాకిస్థాన్ మాజీ ఆటగాడు మహమ్మద్ ఆమిర్ టీమిండియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారత్ కనీసం సెమీఫైనల్‌కు కూడా చేరుకోలేదని.. ఈ జట్టులో ఆ సత్తా లేదని ఓ ఇంటర్వ్యూలో ఎద్దేవా చేశాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా మైదానంలో అద్భుత ప్రదర్శనతో ఆమిర్ అంచనాలను తలకిందులు చేసింది. ఇప్పుడు భారత్ అధికారికంగా సెమీస్‌లోకి అడుగుపెట్టడంతో సోషల్ మీడియాలో భారత అభిమానులు మహ్మద్ ఆమిర్ పాత ప్రకటనను గుర్తు చేస్తూ.. "ఇది మా టీమిండియా ఇచ్చిన గట్టి సమాధానం" అంటూ గట్టిగా ట్రోల్ చేస్తున్నారు.

IND vs WI Team India Enters T20 World Cup 2026 Semis Fans Troll Mohammad Amir for Mockery

ఫీల్డింగ్ లోపాలను అధిగమించిన బ్యాటర్లు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్‌కు ఫీల్డింగ్ రూపంలో కొన్ని చుక్కెదురు దృశ్యాలు కనిపించాయి. ముఖ్యంగా అభిషేక్ శర్మ, తిలక్ వర్మ సులువైన క్యాచ్‌లను వదిలేయడం విండీస్ జట్టు భారీ స్కోరు సాధించడానికి దోహదపడింది. రూథర్‌ఫోర్డ్ ఇచ్చిన క్యాచ్‌ను తిలక్ వర్మ చేజార్చగా.. అది సిక్సర్‌గా మారడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు అత్యధికంగా 13 క్యాచ్‌లను వదిలేసింది. సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లకు ముందు ఈ ఫీల్డింగ్ లోపాలు జట్టు యాజమాన్యాన్ని కలవరపెడుతున్నప్పటికీ.. బ్యాటర్లు ఆ లోటును భర్తీ చేశారు.

IND vs WI: టీమిండియా చెత్త ఫీల్డింగ్IND vs WI: టీమిండియా చెత్త ఫీల్డింగ్

బౌలర్ల కట్టుదిట్టం.. బ్యాటర్ల విధ్వంసం
వెస్టిండీస్ బ్యాటర్లు ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ తమ అనుభవంతో కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి ప్రత్యర్థిని అడ్డుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌లో ఫీల్డింగ్‌లో చేసిన తప్పును సవరించుకుంటూ అభిషేక్ శర్మ ఆరంభంలోనే ధాటిగా ఆడాడు. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా క్రీజులో పాతుకుపోయి, బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లతో భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. 5 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి భారత్ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.

టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో..
బయట వినిపించే విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా, మైదానంలో కేవలం ఆటతోనే సమాధానం చెప్పడం టీమిండియా ప్రత్యేకత అని ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది. పాక్ మాజీల విమర్శలన్నింటినీ పక్కనపెట్టి, ఇప్పుడు భారత్ ప్రపంచకప్ టైటిల్‌కు కేవలం రెండు అడుగుల దూరంలో నిలిచింది. సెమీస్ గండం గడిస్తే మరోసారి భారత్ విశ్వవిజేతగా నిలిచే అవకాశం మెండుగా ఉంది.

Story first published: Monday, March 2, 2026, 9:34 [IST]
Other articles published on Mar 2, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+