న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దళితుల పట్ల యువరాజ్ సింగ్ అనుచిత వ్యాఖ్యలు.. మండిపడుతున్న నెటిజన్లు

Twittarti seek apology from Yuvraj Singh for making casteist remark on Yuzvendra Chahal

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడని ఈ స్టార్‌ఆల్‌రౌండర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. కుల అహంకారంతో చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలని #युवराज_सिंह_माफी_मांगो (యువరాజ్ సింగ్ మాఫీ మాంగో) యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..

రెండు నెలల క్రితం భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మతో యువరాజ్ సింగ్ ఇన్‌స్టా లైవ్ సెషన్‌ నిర్వహించాడు. వీరి లైవ్ సెషన్‌ మధ్యలో దూరి కామెంట్ చేసిన టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ను ఉద్దేశించి ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు సరదాగా మాట్లాడుకున్నారు. ముఖ్యంగా అతని టిక్ టాక్ వీడియోల గురించి ప్రస్తావించారు. ఈ క్రమంలో యువరాజ్‘ఈ బాంగీ మనషుల్లా యూజీకి పనిపాట లేనట్లుంది. అతని కుటుంబంతో చేసిన వీడియోలు చూశావా?'అని రోహిత్‌ను ప్రశ్నించాడు.

ఓ వర్గాన్ని కించపరిచేలా..

అయితే దళిత వర్గానికి చెందిన ఓ కులాన్ని హిందీలో బాంగీ అని పిలుస్తారని, ముఖ్యంగా వీధుల ఊడ్చే వారిని, దిగువ స్థాయి కులాలకు చెందిన వారిని ఇలా పిలుస్తారని, అలాంటి పదాన్ని ఉపయోగించిన యూవీ వారిని కించపరిచాడని నెటిజన్లను ఆరోపిస్తున్నారు. రెండు నెలల క్రితం అన్న ఈ మాటలకు సబంధించిన వీడియో క్లిప్‌ ఇప్పుడు ట్రెండ్ అవడంతో దళిత వర్గానికి చెందిన వారంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్‌లో యువరాజ్...

ట్రెండింగ్‌లో యువరాజ్...

ఇక నెటిజన్లంతా యువరాజ్‌పై దుమ్మెత్తిపోస్తుండటంతో ఈ వీడియో ట్విటర్‌లో హల్‌చల్ చేస్తుంది. యువరాజ్ సింగ్, #युवराज_सिंह_माफी_मांगो ట్యాగ్‌లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఇప్పటికే ఈ వీడియోకి సంబంధించి 23వేల ట్వీట్లు చేశారు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఫౌండేషన్‌కు సాయం చేయాలని కోరి విమర్శలను ఎదుర్కొన్న యూవీ..ప్రస్తుతం అంతకు మించి ట్రోలింగ్‌కు గురవుతున్నాడు.

ఐపీఎల్‌పై క్లారిటీ ఇచ్చిన గంగూలీ

ఎస్సీ, ఎస్టీలను కించపరచడమే..

ఇక క్యాన్సర్‌ను జయించిన యూవీ.. కుల అహంకారాన్ని మాత్రం వదులుకోలేదని నెటిజన్లు మండిపడుతున్నారు. అతను ఉపయోగించిన బాంగీ పదం ఎస్సీ, ఎస్టీ వర్గాలను కించపరిచేలా ఉందని కామెంట్ చేస్తున్నారు. ‘నువ్వో చాంపియన్ కానీ కుల విద్వేశాన్ని వ్యాపింప చేస్తున్నావ్'అని ఒకరు.. అభిమానులమని చెప్పుకునేందుకు సిగ్గుపడుతున్నామని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు. ఇక యూవీ వ్యాఖ్యలు తమను చాలా బాధించాయని ఇంకొందరు ట్వీట్ చేస్తున్నారు.

బాంగీ కాదు.. బగ్గీ అన్నాడు..

బాంగీ కాదు.. బగ్గీ అన్నాడు..

ఇక యూవీ మద్దతుదారులు మాత్రం బగ్గీ అన్నాడని కామెంట్ చేస్తున్నారు. పంజాబీలో బగ్గీ అనేది ఓ సరదా పదమని వివరణ ఇస్తున్నారు. స్వీట్ హార్ట్, డార్లింగ్, స్వీటీ అనే పదాలకు పర్యాయపదంగా వాడుతారని తమ అభిమాన క్రికెటర్‌కు మద్దతు తెలుపుతున్నారు. రెండు నెలల కిందటి వీడియోను ఉద్దేశపూర్వకంగా ట్రెండ్ చేస్తున్నారని ఇంకొందరూ అభిప్రాయపడుతున్నారు.

నీకు ఎంత ధైర్యం ఉంటే నా భర్త పేరు అలా రాస్తావ్?.. నెటిజన్‌పై క్రికెటర్ భార్య ఫైర్

Story first published: Tuesday, June 2, 2020, 14:36 [IST]
Other articles published on Jun 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X