టీ20 ప్రపంచకప్ 2026లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో ఐసీసీ అత్యుత్తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో భారత్ నుంచి నలుగురు ఆటగాళ్లు అవకాశం అందుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ సంజూ శాంసన్‌తో పాటు ఇషాన్ కిషన్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చోటు దక్కించుకున్నారు.
ఈ టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచిన పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. పాకిస్థాన్ నుంచి ఈ జట్టుకు ఎంపికైన ఏకైక ఆటగాడు అతను. సౌతాఫ్రికా నుంచి ఎయిడెన్ మార్క్‌రమ్, లుంగి ఎంగిడి అవకాశం అందుకోగా.. ఇంగ్లండ్ నుంచి విల్ జాక్స్, ఆదిల్ రషీద్ చోటు దక్కించుకున్నారు. వెస్టిండీస్ నుంచి జాసన్ హోల్డర్‌కు అవకాశం దక్కింది. జింబాబ్వే బౌలర్ ముజరబాని అవకాశం అందుకోగా.. అమెరికా పేసర్ షాడ్లీ వాన్ షాక్ 12వ ఆటగాడిగా ఎంపికయ్యాడు.

ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నీ జట్టుకు ఎయిడెన్ మార్క్‌రమ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయగా.. సంజూ, ఫర్హాన్ ఓపెనర్లుగా.. ఇషాన్ కిషన్, మార్క్‌రమ్ మిడిలార్డర్ బ్యాటర్లుగా ఎంపికవ్వగా.. హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, జాసన్ హోల్డర్ ఆల్‌రౌండర్లుగా అవకాశం అందుకున్నారు. బుమ్రా, ఎంగిడి, ముజరబాని పేసర్లుగా ఎంపికవ్వగా.. ఆదిల్ రషీద్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా అవకాశం అందుకున్నాడు. అయితే ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ నుంచి ఒక్క ఆటగాడికి అవకాశం దక్కకపోవడం గమనార్హం. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన శివమ్ దూబేకు ఈ జట్టులో చోటు దక్కలేదు.
ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నీ: సాహిబ్‌జాదా ఫర్హాన్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, ఎయిడెన్ మార్క్‌రమ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, జాసన్ హోల్డర్, జస్‌ప్రీత్ బుమ్రా, లుంగి ఎంగిడి, ఆదిల్ రషీద్, ముజరబాని, షాడ్లీ వాన్ షాక్(12వ ఆటగాడు).