For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. రోహిత్ శర్మ ఆల్‌టైమ్ రికార్డ్ బద్దలు!

టీమిండియా విధ్వంసకర ఓపెనర్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ రికార్డ్‌ను అధిగమించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన సంజూ శాంసన్.. 16 సిక్స్‌లు బాదాడు. తద్వారా రోహిత్ శర్మ పేరిట ఉన్న 15 సిక్స్‌ల రికార్డును అధిగమించాడు. ఇంగ్లండ్‌తో గురువారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ 7 సిక్స్‌లు కొట్టడం ద్వారా ఈ ఘనతను అందుకున్నాడు.

లీగ్ దశలో నమీబియాతో ఒక మ్యాచ్ ఆడిన సంజూ శాంసన్.. సూపర్-8లో జింబాబ్వే, వెస్టిండీస్‌పై బరిలోకి దిగాడు. నమీబియాతో మ్యాచ్‌లో మూడు సిక్స్‌లు బాదిన సంజూ.. జింబాబ్వేతో రెండు, వెస్టిండీస్‌పై నాలుగు సిక్స్‌లు కొట్టాడు. రోహిత్ శర్మ 2024 టీ20 ప్రపంచకప్‌లో 15 సిక్స్‌లు బాది ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. సంజూ శాంసన్ అధిగమించాడు.

Sanju Samson Shatters Rohit Sharma s Record for Most Sixes by an Indian in a T20 World Cup Edition

సింగిల్ ఎడిషన్ టీ20 ప్రపంచకప్‌లో సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్ల జాబితాలో సంజూ శాంసన్(16) తర్వాత శివమ్ దూబే(15), రోహిత్ శర్మ(15), ఇషాన్ కిషన్(14), హార్దిక్ పాండ్యా(14), యువరాజ్ సింగ్ ఉన్నారు. ఇందులో రోహిత్(2026), యువరాజ్ సింగ్(2007) మినహా మిగతా బ్యాటర్లంతా ఈ ఎడిషన్‌లో సిక్స్‌లు బాదడం గమనార్హం.

ఓవరాల్‌గా ఈ జాబితాలో ఫిన్ అలెన్ 20 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. షిమ్రాన్ హెట్‌మైర్(19), ఫర్మాన్(18), నికోలస్ పూరన్(17) సంజూ శాంసన్ కంటే ముందున్నారు. న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్లో సంజూ తన జోరు కొనసాగిస్తే.. ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవనున్నాడు. ఈ ఎడిషన్‌లో నాలుగు మ్యాచ్‌లే ఆడిన సంజూ రెండు హాఫ్ సెంచరీలతో 232 పరుగులు చేశాడు. పేలవ ఫామ్‌తో తుది జట్టులో చోటు కోల్పోయిన సంజూ.. లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌లో భాగంగా అవకాశం అందుకొని ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

సింగిల్ ఎడిషన్ టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్లు

ఫిన్ అలెన్ న్యూజిలాండ్ 2026 20
షిమ్రాన్ హెట్మెయర్ వెస్టీండీస్ 2026 19
సాహిబ్జాదా ఫర్హాన్ పాకిస్థాన్ 2026 18
నికోలస్ పూరన్ వెస్టిండీస్ 2024 17
సంజూ శాంసన్ భారత్ 2026 16
క్రిస్ గేల్ వెస్టిండీస్ 2012 16
రహ్మానుల్లా గుర్బాజ్ అఫ్గానిస్థాన్ 2024 16
Story first published: Friday, March 6, 2026, 16:27 [IST]
Other articles published on Mar 6, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+