భారత్‌కు ఐసీసీ ట్రోఫీ అందించిన మరో కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ చరిత్రకెక్కాడు. దిగ్గజ సారథులైన కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మల సరసన నిలిచాడు. అయితే భారత్‌ను విశ్వవిజేతగా నిలబెట్టడంలో ఈ ముగ్గురు దిగ్గజాలు పడిన శ్రమలో ఇసుమంత కష్టం కూడా సూర్య పడలేదంటే అతిశయోక్తి కాదు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పుణ్యమా.. సహచర ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ప్రపంచకప్ అందుకున్నాడు. గంభీర్ ఆడించిన తోలు బొమ్మలా ఆడి చిరస్మరణీమైన విజయంలో భాగమయ్యాడు.
ఈ ప్రపంచకప్‌లో సూర్య మార్క్ కెప్టెన్సీ అనే క్షణాలు ఒక్కటి కూడా లేవు. డగౌట్ నుంచి గంభీర్ అందించే వ్యూహాలు, సూచనలు అమలు చేశాడు. కెప్టెన్‌గా 52 మ్యాచ్‌ల్లో 40 విజయాలు సాధించినా.. వ్యక్తిగతంగా సూర్య రాణించింది ఏం లేదు. ప్రపంచకప్ ముందు వరుసగా 23 మ్యాచ్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ సాధించలేదు. ఈ మెగా టోర్నీలోనూ అమెరికాతో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన మినహా బ్యాట్‌తో సూర్య చేసిందేం లేదు.

మీడియా సమావేశంలో అనవసర వ్యాఖ్యలతో తన అపరిపక్వతను చాటుకున్నాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు సంజూ శాంసన్‌కు అవకాశం ఇస్తారా? అని ఓ మీడియా ప్రతినిధి సూర్యను ప్రశ్నించాడు. సాధారణంగా మరో కెప్టెన్ అయితే జట్టులోని 15 మంది సమర్థులే. పిచ్ కండిషన్స్ బట్టి తుది జట్టు ఎంపికను నిర్ణయిస్తామని సమాధానమిచ్చేవాడు. కానీ సూర్యకుమార్ యాదవ్ మాత్రం అహంకారంగా నవ్వుతూ.. 'అభిషేక్‌ను తీసి ఆడించమంటారా.. తిలక్‌ను పక్కనపెట్టాలా?'అని ఎటకారంగా ఎదురు ప్రశ్న వేసాడు.
చివరకు తప్పని పరిస్థితుల్లో సంజూ శాంసన్ ఆడించగా.. అతనే మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో సూర్య నవ్వుల పాలయ్యాడు. ఫైనల్‌కు ముందు ఆఫ్ స్పిన్ బౌలింగ్‌లో భారత బ్యాటర్లు తడబడటంపై ప్రశ్నించగా.. 120 స్ట్రైక్‌రేట్‌తో ఆడుతూ కూడా ఫైనల్‌కు వచ్చామంటే అలాగే ఆడుతామని అర్థం లేని సమాధానం చెప్పాడు. ఒక నాయకుడిగా ఈ సమాధానం అతని అపరిపక్వతను సూచిస్తుంది. కానీ ప్రపంచకప్ విజయంతో ఇవన్నీ పక్కకు పోయాయి. ఒక్క మ్యాచ్ ఆడకున్నా.. కెప్టెన్సీలో రాణించకున్నా.. ప్రపంచకప్ అందించిన నాయకుడిగా సూర్య చరిత్రలో నిలిచిపోతాడు.

నిజానికి రోహిత్ రిటైర్మెంట్ తర్వాత టీ20ల్లో సూర్య ఆటోమెటిక్ ప్రత్యామ్నాయం ఏం కాదు. బ్యాటర్‌గా మంచి గుర్తింపు ఉన్నా.. కెప్టెన్‌గా అతనికి ఎలాంటి రికార్డు కూడా లేదు. రోహిత్ శర్మ గైర్హాజరీలో టీ20ల్లో టీమిండియాను నడిపించిన హార్దిక్ సారథి అవుతాడని అంతా అనుకున్నారు. కానీ గంభీర్ ఎంట్రీతో అతను సైడ్ అవ్వగా.. సూర్యకు కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి. ఫిట్‌నెస్ సమస్యలను సాకుగా చూపుతూ హార్దిక్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించారు. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుస విజయాలు సూర్య స్థానాన్ని పటిష్టం చేశాయి.
టీ20 ప్రపంచకప్ ముందు వరుసగా 9 టీ20 సిరీస్‌లు భారత్ ఖాతాలో చేరాయి. పేలవ ఫామ్ కారణంగా సూర్యను తప్పించాలనే డిమాండ్ వచ్చినా.. ప్రపంచకప్‌కు తక్కువ సమయం ఉండటంతో బీసీసీఐ ఆ సాహసం చేయలేకపోయింది. ప్రపంచకప్‌లోనూ టీమిండియా ప్రదర్శన ముందు జట్టు తేలిపోవడంతో ట్రోఫీని అందుకోవడం సూర్య సఫలమయ్యాడు. కానీ భవిష్యత్తులో అతను బ్యాట్ ఝులిపించకపోతే జట్టుకు దూరమవుతాడు. ఒలింపిక్స్ మెడల్ గెలవాలనే తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలంటే సూర్య.. ఒకప్పటిలా రాణించాల్సిందే.
