న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నీకు ఎంత ధైర్యం ఉంటే నా భర్త పేరు అలా రాస్తావ్?.. నెటిజన్‌పై క్రికెటర్ భార్య ఫైర్!

 Manoj Tiwary’s wife furious over his inclusion in fan page’s Flop Cricketers XI

ముంబై: భారత క్రికెటర్ మనోజ్ తివారీ పేరును 'ఫ్లాప్ క్రికెటర్ల జాబితా'లో చేర్చిన ఓ నెటిజన్‌పై అతని భార్య సుస్మిత రాయ్ మండిపడింది. 'నీకెంత ధైర్యం ఉంటే నా భర్త పేరును ఆ లిస్టులో పెడతావ్? నిజాలు తెలుస్కోకుండా నోటికొచ్చినట్లు రాస్తావా? ఇలాంటి చెత్త రాసే బదులు నీ ఛండాలమైన జీవితానికి ఉపయోగపడే పనేదైనా చేస్కో' అంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది.

దెబ్బకు డిలీట్

దెబ్బకు డిలీట్

ఇన్‌స్టాగ్రామ్‌లో ఐపీఎల్ ఫ్రీక్ అనే పేరుతో ఓ వ్యక్తి.. ‘టీమిండియాలోని 11 మంది ఫ్లాప్ క్రికెటర్లు' అంటూ ఓ జాబితాను విడుదల చేశాడు. అందులో మనోజ్ తివారీ పేరును కూడా చేర్చడంతోనే సుస్మిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్తను కించపరిచినందుకు సదరు నెటిజన్‌పై దుమ్మెత్తిపోసింది. దీంతో ఆ వ్యక్తి తన పోస్ట్‌ను తొలగించాడు.

నువ్వు మగాడ్రా పాండ్యా.. విరుష్కా మీరెప్పుడూ?

 2008లో అరంగేట్రం..

2008లో అరంగేట్రం..

భారత్ తరఫున 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన 12 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లాడిన మనోజ్ తివారీ.. 2011లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. కానీ.. ఆ తర్వాత ఏడాది వరకూ మళ్లీ అతనికి వన్డేలు ఆడే అవకాశం దక్కలేదు. ఎంతలా అంటే.. సెంచరీ తర్వాత ఏకంగా 14 మ్యాచ్‌ల్లో అతను రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఐపీఎల్‌‌లో 2012లో కేకేఆర్‌ ట్రోఫీని సొంతం చేసుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. 2018లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో తివారీని పంజాబ్‌ జట్టు దక్కించుకోగా.. 2019లో మాత్రం అతడికి నిరాశే మిగిలింది. 50 లక్షల బేస్‌ప్రైజ్‌కు కూడా ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.

బెంగాల్ జట్టులో కీలక ఆటగాడిగా..

బెంగాల్ జట్టులో కీలక ఆటగాడిగా..

ఇక, దేశవాలీ క్రికెట్‌లో బెంగాల్‌ జట్టు తరఫు తివారీ కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2019-20 సీజన్‌లో బెంగాల్‌ ఫైనల్‌కు చేరడంలో తివారీ కీలక పాత్ర పోషించాడు. 11 మ్యాచ్‌ల్లో మొత్తం 707 పరుగులు చేశాడు. అద్భుత ప్రదర్శన కనబర్చినా ఎందుకు పక్కన పెట్టారనీ నాటి భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని అడగలేకపోయానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మనోజ్ తివారీ అన్నాడు. అప్పుడు మహీని ప్రశ్నించే ధైర్యం కూడా తనకు లేదని చెప్పుకొచ్చాడు.

కేకేఆర్‌పై ఫైర్

కేకేఆర్‌పై ఫైర్

2012 ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన క్షణాలను గుర్తు చేసుకుంటూ కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ చేసిన ట్వీట్‌పై మనోజ్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టోర్నీ ఆసాంతం రాణించిన షకీబ్ అల్ హసన్,తన పేరును ట్యాగ్ చేయకపోవడం తమను అవమానించినట్లేనని మండిపడ్డాడు. దీనిపై వెంటనే స్పందించిన కేకేఆర్.. వీళ్లిద్దరినీ ఆ ట్వీట్‌లో ట్యాగ్ చేసింది. ‘‌నో వే మనోజ్.. నీలాంటి ప్రత్యేకమైన ఆటగాడిని ట్యాగ్ చేయడం మర్చిపోం. 2012 విజయంలో నువ్వే మా హీరోవి.'అని బదులిచ్చింది. ఇక ఆ సీజన్‌లో మనోజ్ తివారీ 15 ఇన్నింగ్స్‌ల్లో 260 పరుగులతో ఆకట్టుకున్నాడు. షకీబ్ అల్ హసన్ 12 వికెట్లతో రాణించి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఊరి క్రికెట్ డీఆర్ఎస్ చూశారా? కడుపుబ్బా నువ్వుతారు..!

Story first published: Tuesday, June 2, 2020, 9:19 [IST]
Other articles published on Jun 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X