For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒడియమ్మ బంటీ.. ఇవి సంబరాలా? ముద్దుల పోటీలా..? (వీడియో)

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయానంతరం ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తమ భాగస్వాములతో కలిసి ఆటగాళ్లు వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన టీమిండియా 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది.

ఈ గెలుపుతో డిఫెండింగ్ ఛాంపియన్‌గా టైటిల్ నిలబెట్టుకోవడంతో పాటు సొంతగడ్డపై ప్రపంచకప్ గెలిచిన టీమ్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీమిండియాకు ఇది మూడో టీ20 ప్రపంచకప్ కావడం విశేషం. ఈ విజయానంతరం భారత ఆటగాళ్ల కుటుంబ సభ్యులు, భాగస్వాములు మైదానంలోకి అనుమతించారు. ఆటగాళ్లంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ విజయాన్ని ఆస్వాదించారు.

మరోవైపు రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ ఆటగాళ్లు కూడా తమ సతీమణులు, కుటుంబ సభ్యులతో మైదానంలోకి వచ్చారు. భారత అభిమానుల సంబరాలను చూస్తూ నిలబడిపోయారు. అయితే ఈ సందర్భంగా కొందరు ఆటగాళ్లు తమ పార్టనర్స్‌ను మద్దులతో ముంచెత్తారు. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లేన్ ఫిలిప్స్, స్పిన్నర్ ఇష్ సోదీ మైదానంలోనే తమ సతీమణులకు లిప్ టు లిప్ కిస్ ఇచ్చారు. మైదానంలో ప్రేక్షకులు ఉన్నారనే సోయిలేకుండా ప్రవర్తించారు.

T20 World Cup 2026 Hardik Pandya Glenn Phillips and Ish Sodhi Face Social Media Backlash Over Post-Match Celebration Video

మరోవైపు హార్ద్ పాండ్యా కూడా తన ప్రియురాలు మహికా శర్మ‌ను ముద్దులతో ముంచెత్తాడు. ఒక చేత్తో ట్రోఫీ మరోచేతిని ఆమెపై వేసి రోమాన్స్ చేశాడు. పోడియంపై పడుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్లకు కామన్ సెన్స్ లేదని మండిపడుతున్నారు. కొందరైతే ఇవి సంబరాలా? ముద్దుల పోటీలా? అని కామెంట్ చేస్తున్నారు. ఓడిపోయిన బాధలో ఉన్న న్యూజిలాండ్ ఆటగాళ్లకు తమ సతీమణులు ముద్దులతో ఓదార్చుతున్నారని నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు.

తన మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత మహికా శర్మతో హార్దిక్ పాండ్యా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. మహికా శర్మ రాకతో తన జీవితం మారిపోయిందని, ఆమె తన లక్కీ ఛార్మ్ అని కూడా హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, March 10, 2026, 15:59 [IST]
Other articles published on Mar 10, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+