తన హెయిర్ స్టైల్ వెనుక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేడని టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ స్పష్టం చేశాడు. లాంగ్ హెయిర్ స్టైల్ ఉంటే బాగుంటుందనిపించిందని, హెల్మెట్ పెట్టుకుంటే హెయిర్ బయటకు వచ్చి మంచి ఫీలింగ్ కలుగుతుందని చెప్పాడు. దాంతోనే హెయిర్ స్టైల్ మార్చానని స్పష్టం చేశాడు.
ద్వైపాక్షిక టీ20 సిరీస్ సందర్భంగా టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఇంటర్వ్యూయర్‌గా మారిన సూర్య.. తిలక్ వర్మ హెయిర్ స్టైల్ సీక్రెట్ ఏంటా? అని ఆరా తీసాడు. తెలుగు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను చూసి లాంగ్ హెయిర్ స్టైల్ పెంచావా? పుష్ప-3 కోసం ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? అని అడిగాడు. దానికి తిలక్ లేదని బదులిచ్చాడు.

ఈ సంభాషణకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్.. తిలక్ వర్మ... భాయ్ హెయిర్ స్టైల్‌ను కాపీ కొట్టాడని సంతోషం వ్యక్తం చేస్తూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో తిలక్.. తన హెయిర్ స్టైల్‌కు అల్లు అర్జున్ కారణం కాదని స్పష్టం చేశాడు.

సూర్యకుమార్ యాదవ్: తిలక్, నేనొక విషయం అడగాలనుకుంటున్నాను. అందరూ నీ హెయిర్ స్టైల్ సీక్రెట్ అల్లు అర్జున్ అని అంటున్నారు. ఏంటి సంగతి?
తిలక్: ఏం లేదు. ఇప్పుడిప్పుడే పెంచుతున్నాను. ఇంకా అల్లు అర్జున్ రేంజ్‌కి రాలేదు అది. లాంగ్ హెయిర్‌తో హెల్మెట్ పెట్టుకుంటే మంచి అనుభూతి కలుగుతోంది. అందుకే పెంచాను.
సూర్యకుమార్ యాదవ్: ఇంతకీ ఏంది.. 'పుష్ప 3' లో ఛాన్స్ ఏమైనా కొట్టేస్తున్నావా ఏంది?
తిలక్: మనకెందుకు భయ్యా అవన్నీ! మన పని బ్యాటూ, బాల్‌తోనే. గ్రౌండ్ లో దిగడం, చెమటోడ్చడం.. అంతే మనకు తెలిసింది!
సూర్యకుమార్ యాదవ్: ఈ కుర్రాడికి ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత సింప్లిసిటీ అబ్బా!
Tilak Varma's long hair is inspired from Allu Arjun 🔥#Pushpa2TheRule @alluarjun pic.twitter.com/FzQrfvPoDZ
— -𝘼𝙇𝙇𝙐ᴋᴀʀᴛʜɪк 🐎🗡️ (@AAdmirer_) March 9, 2026
ప్రపంచకప్ విన్నర్ తిలక్..
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో తిలక్ వర్మ 9 మ్యాచ్‌ల్లో 154.47 స్ట్రైక్‌రేటుతో 207 పరుగులు చేశాడు. చివర్లో బ్యాటింగ్‌కు వచ్చి విలువైన పరుగులు అందించాడు. ఇప్పటికే బీసీసీఐ భారత జట్టుకు రూ.131 కోట్ల భారీ నజరానా ప్రకటించగా.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆటగాళ్లకు రివార్డ్స్ అందజేసే అవకాశం ఉంది. తిలక్ వర్మకు కూడా తెలంగాణ సర్కార్ భారీ క్యాష్ ప్రైజ్ ప్రకటించవచ్చు.
