న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బార్డర్ టెన్షన్స్ చూస్తుంటే.. కరోనా చైనా కుట్రే అనిపిస్తోంది: రైనా

Suresh Raina Says China doesnt deserve anything from India
Suresh Raina Reveals The Name Of Best Fielder In The Present Indian Team

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు చూస్తుంటే కరోనా వైరస్.. చైనా కుట్రే అనిపిస్తోందని భారత వెటరన్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా సందేహం వ్యక్తం చేశాడు. ప్రపంచంపై ఆధిపత్యం చలాయించేందుకే చైనా కరోనా వైరస్ సృష్టించిందేమోననే అనుమానం కలుగుతుందన్నాడు. గల్వాన్‌ వద్ద చెలరేగిన తీవ్ర ఘర్షణలో మన దేశానికి చెందిన 20మంది సైనికులు మరణించడంపై చైనా పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ రైనా స్పందించాడు. భారత్‌పై దాడులకు తెగబడుతున్న చైనా మన డబ్బుతో నడవకూడదనీ.. డ్రాగన్ కంట్రీతో అన్ని సంబంధాలను తెంచుకోవాలన్నాడు. అందుకే ఆ దేశ వస్తువుల వాడకాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చాడు.

మాట్లాడటం సులువే..

మాట్లాడటం సులువే..

సైనికులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధకరమన్న రైనా.. ఇక్కడ కూర్చోని మాట్లాడటం సులువేనని, కానీ వారి కుటుంబాల క్షోభ వర్ణాతీతమన్నాడు. ‘మన సైనికులు ప్రాణాలు కోల్పోవడం చాలా ఆగ్రహాన్నికలిగిస్తుంది. అలాగే బాధగా కూడా ఉంది. ప్రభుత్వం చేయాల్సిన పని చేస్తుందనని ఆశిస్తున్నా. ఇక్కడ కూర్చొని మాట్లాడటం సులువే. కానీ ఆ కుటుంబాల బాధ వర్ణాతీతం. సరిహద్దుల్లో మాతృభూమి కోసం ప్రాణాలు పనంగా పెట్టి పోరాడుతున్న సైనికులను కొనియాడటానికి నాకు మాటలు కూడా రావడం లేదు.

అందుకే సచిన్ కెప్టెన్సీ వదులుకున్నాడు: మాజీ చీఫ్ సెలెక్టర్

ప్రతీ ఒక్కరికి నా సెల్యూట్..

ప్రతీ ఒక్కరికి నా సెల్యూట్..

ఆర్మీ చాలా బలమైనది. ప్రతీ ఒక్క జవాన్‌కు నా సెల్యూట్. ముందు కరోనా.. ఇప్పుడు సరిహద్దు ఉద్రిక్తతలు.. ఇదంతా చూస్తుంటే చైనా ఏదో కుట్ర చేసిందనిపిస్తుంది. మన సాయుద బలగాలు బలంగా ఉన్నాయని నేను భావిస్తున్నా. వారి వల్లే నేను భద్రంగా ఉన్నానని ఫీలవుతున్నా.'అని రైనా చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్‌ స్పాన్సర్‌షిప్‌ ఒప్పందాలపై చర్చించేందుకు వచ్చే వారంలో సమావేశం కానున్నట్టు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ వెల్లడించిన నేపథ్యంలో ఈ అంశంపైనా రైనా స్పందించాడు. ఐపీఎల్‌ స్పాన్సర్‌షిప్‌పై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందన్నాడు.

నష్టమేం లేదు..

నష్టమేం లేదు..

‘చైనా కంపెనీల స్పాన్సర్‌షిప్ విషయంలో బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. దేశం తరఫున ఆడుతూ.. ప్రతీ ఒక్కరు గర్వించేలా చేయడమే మా కర్తవ్యం. దాని కోసం మా సాయశక్తుల శ్రమిస్తాం. ఇక భారత ప్రభుత్వం, బీసీసీఐ, ప్రధాని.. సరిహద్దుల్లోకి వెళ్లాలని చెబితే వెళ్తాం. భారత బలగాలకు సాయం చేస్తాం. ప్రతీ సైనికుడికి ఈ దేశం మొత్తం అతని వెంట ఉందనే విషయాన్ని తెలియజేస్తాం. నాది ఆర్మీ కుటుంబ నేపథ్యమే. సైనికులు జీవితం పూలపాన్పు కాదనే విషయం నాకు తెలుసు. భారత్ డబ్బును అందుకునేందుకు చైనాకు అర్హత లేదు. చైనా ఉత్పత్తులు వాడకపోతే మనకు వచ్చే నష్టమేం లేదు.'అని రైనా పేర్కొన్నాడు.

ఇండో-చైనా బార్డర్ గల్వాన్ వ్యాలీలో ఇరుదేరశాల సైనికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో రెండు వైపుల తీవ్ర ప్రాణం నష్టం జరిగిన విషయం తెలిసిందే. అందులో మన తెలుగు ముద్దు బిడ్డ, తెలంగాణవాసి కల్నల్ సంతోష్‌బాబు కూడా మాతృభూమి కోసం నేలకొరిగాడు.

చైనా స్పాన్సర్లు ఎందుకు: హర్భజన్

చైనా స్పాన్సర్లు ఎందుకు: హర్భజన్

ఇక వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా డ్రాగన్ కంట్రీ ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చాడు. ‘స్వయం సమృద్ధిని సాధించాలంటే చైనా ఉత్పత్తులను బాయ్‌కాట్‌ చేయడమే మంచిది. వాళ్ల దేశాన్ని మన సొమ్ముతో ఎలా నడుపుతారు? చైనా వస్తువులను బాయ్‌కాట్‌ చేసే వారితో నేనూ ఉంటా. నాకు ఎలాంటి చైనా ఎండార్స్‌మెంట్లు లేవు' అని హర్భజన్‌ స్పష్టం చేశాడు.

ఆ పాక్ స్పిన్నర్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం: గంభీర్

Story first published: Monday, June 22, 2020, 14:42 [IST]
Other articles published on Jun 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X