Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే సచిన్ కెప్టెన్సీ వదులుకున్నాడు: మాజీ చీఫ్ సెలెక్టర్

Former chief selector Chandu Borde recalls how Sachin Tendulkar quit India captaincy

ముంబై: క్రికెట్ దేవుడిగా.. ప్రపంచ క్రికెట్ ముఖ చిత్రంగా నిలిచిన భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ విజయవంతమైన కెరీర్‌లో ఏదైనా లోటు ఉందంటే అది కెప్టెన్సీ ఒక్కటే. మైదానంలో పరుగుల రారాజుగా.. 100 సెంచరీల మొనగాడు‌గా అందరి ప్రశంసలు అందుకున్న మాస్టర్.. కెప్టెన్‌గా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. కఠినమైన బౌలర్లను తన బ్యాట్‌తో చీల్చిచెండాడిన సచిన్.. సారథ్య ఒత్తిడిని మాత్రం మోయలేకపోయాడు. అతని 24 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌లో ఇదొక్కటే మాయని మచ్చగా మిగిలిపోయింది.

ఆస్ట్రేలియా టూర్‌తో..

ఆస్ట్రేలియా టూర్‌తో..

1996 ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక మ్యాచ్‌ గల బోర్డర్ గావస్కర్ సిరీస్‌తో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న సచిన్.. 73 వన్డేలు, 25 టెస్టుల్లో జట్టును నడిపించాడు. కానీ జట్టుకు మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలన్నందించలేకపోయాడు. అతని సారథ్యంలో భారత్ 23 వన్డేలు, 4 టెస్ట్‌లు మాత్రమే గెలవడం గమనార్హం. వ్యక్తిగతంగా రాణించినా.. జట్టును నడిపించడంలో విఫలమయ్యాడు.

 కెప్టెన్సీ వద్దన్నాడు..

కెప్టెన్సీ వద్దన్నాడు..

అయితే బ్యాటింగ్‌పై దృష్టిపెట్టడం కోసం అప్పట్లో సచిన్ కెప్టెన్సీని వదులుకున్నాడని నాటి చీఫ్ సెలక్టర్ చందు బోర్డే తాజాగా వెల్లడించాడు. ముఖ్యంగా.. 1999 ఆస్ట్రేలియా పర్యటన తర్వాత సచిన్ కెప్టెన్సీని వదులుకోవాలని నిర్ణయించుకున్నాడని, ఎంత సర్ధిచెప్పినా తమ మాటను వినలేదని స్పోర్ట్స్ కీదా లైవ్ సెషన్‌లో చందు గుర్తు చేసుకున్నాడు. ‘సచిన్ టెండూల్కర్ సారథ్యంలోనే ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టుని పంపించాం. ఆ సిరీస్‌లో జట్టును సచినే నడిపించాడు. కానీ స్వదేశానికి రాగానే సచిన్.. ఆ బాధ్యత నుంచి తప్పుకోవాలనుకున్నట్లు నాతో చెప్పాడు. బ్యాటింగ్‌పై మరింత శ్రద్ధ పెట్టేందుకు ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. నేను అతనికి సర్ధిచెప్పే ప్రయత్నం చేశా. సుదీర్ఘకాలం నువ్వు కెప్టెన్‌గా కొనసాగగలవని నచ్చచెప్పా. కానీ.. సచిన్ మాత్రం వినలేదు. కెప్టెన్సీ ఒత్తిడితో బ్యాట్‌తో రాణించేలకపోతున్నానని ఫీలయ్యాడు. సచిన్‌‌ను నేను బలవంతం చేయడంతో అప్పట్లో నా సహచరులు కూడా నన్ను వారించారు. దాంతో గంగూలీ చేతికి జట్టు పగ్గాలిచ్చాం'' అని చందు బోర్డే వెల్లడించాడు.

వరుస ఓటములతో..

వరుస ఓటములతో..

వాస్తవానికి ఆ ఆస్ట్రేలియా పర్యటనలో సచిన్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 278 పరుగులతో రాణించాడు. అయినప్పటికీ.. భారత్ జట్టు 0-3 తేడాతో సిరీస్‌ని చేజార్చుకోగా.. అతనికి కెప్టెన్సీ అదనపు ఒత్తిడిలా కనిపించింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో భారత్ గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌ కూడా 0-2 తేడాతో టీమిండియా ఓడిపోవడంతో కెప్టెన్సీని వదులుకోవాలని సచిన్ నిర్ణయించుకున్నాడు. అదే కెప్టెన్‌గా సచిన్‌‌కు ఆఖరి సిరీస్.

 ఆటగాళ్ల వైఫల్యమే కారణం..

ఆటగాళ్ల వైఫల్యమే కారణం..

అయితే కెప్టెన్‌గా సచిన్ వైఫల్యానికి ఇతర ఆటగాళ్లు రాణించకపోవడమే కారణమని మాజీ క్రికెటర్ మదన్ లాల్ ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే. ఎంత సేపు బ్యాటింగ్‌పైనే దృష్టిపెట్టిన సచిన్.. ఇతర ఆటగాళ్ల పట్ల కఠినంగా ఉండలేకపోయాడన్నాడు. మ్యాచ్ గెలవాలంటే ఒక్కడితో సాధ్యం కాదని ఇతర 10 మంది ఆటగాళ్లు కూడా ఆడాలన్నాడు.

‘సచిన్ గొప్ప సారథి కాదంటే నేనేమాత్రం అంగీకరించను. బాధ్యత గల కెప్టెన్‌గా వ్యక్తిగతంగా రాణించడంపైనే సచిన్ దృష్టిపెట్టాడు. దీంతో జట్టును కేర్‌ తీసుకోవడం కష్టమైంది. కెప్టెన్ ఒక్కడే రాణిస్తే విజయాలు దక్కవు. ఇతర పది మంది ఆటగాళ్లు కూడా బాధ్యతాయుతంగా ఆడాలి. దీన్ని సమన్వయం చేయడం కొంచెం కష్టమే. 'అని సచిన్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో భారత జట్టు కోచ్‌గా పనిచేసిన మదన్ లాల్ (1996-97) చెప్పుకొచ్చాడు.

ఫిక్సింగ్ ఆరోపణలతో చావాలనుకున్నా: శ్రీశాంత్

Story first published: Monday, June 22, 2020, 10:52 [IST]
Other articles published on Jun 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+