టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయానంతరం హార్దిక్ పాండ్యా ప్రవర్తించిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన టీమిండియా 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో డిఫెండింగ్ ఛాంపియన్‌గా టైటిల్ నిలబెట్టుకోవడంతో పాటు సొంతగడ్డపై ప్రపంచకప్ గెలిచిన టీమ్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీమిండియాకు ఇది మూడో టీ20 ప్రపంచకప్ కావడం విశేషం.
ఈ విజయానంతరం భారత ఆటగాళ్ల కుటుంబ సభ్యులు, భాగస్వాములు మైదానంలోకి అనుమతించారు. ఆటగాళ్లంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ విజయాన్ని ఆస్వాదించారు. హార్దిక్ పాండ్యా కూడా తన పార్ట్‌నర్ మహికా శర్మతో కలిసి ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఆమెతో కలిసి స్టెప్పులు వేసిన హార్దిక్.. ప్రపంచకప్‌తో కలిసి ఫోజిచ్చాడు. అంతటితో ఆగకుండా ఆమెను పలుమార్లు గట్టిగా హగ్ చేసుకుంటూ ముద్దుల వర్షం కురిపించాడు. కెమెరాలు, మైదానంలో జనాలు ఉన్నారనే సోయి లేకుండా హద్దులు ధాటి ప్రవర్తించాడు.

ట్రోఫీ అందించిన పోడియంపై ఇద్దరు పడుకొని రొమాన్స్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రియురాలు మహికా శర్మతో కలిసి హార్దిక్ బరితెగించిన వీడియోలు నెట్టింట వైరల్ కాగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వీడు వీని ఎక్స్‌ట్రాలు అని మండిపడుతున్నారు. ఆటలో హార్దిక్ ఎంత తోపు అయినా.. పబ్లిక్ ప్లేస్‌లో ఎలా ప్రవర్తించాలనే మ్యానర్స్ లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. హార్దిక్ ప్రవర్తన చిరాకు తెప్పిస్తుందని కామెంట్ చేశారు.
తన మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత మహికా శర్మతో హార్దిక్ పాండ్యా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. మహికా శర్మ రాకతో తన జీవితం మారిపోయిందని, ఆమె తన లక్కీ ఛార్మ్ అని కూడా హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. అయితే ఈ రిలేషన్ ఎన్ని రోజులో చూస్తామని నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు.