న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 ప్రపంచకప్ ఫైనల్లో క్యాచ్ పడతాడునుకోలేదన్న ఊతప్ప వ్యాఖ్యలపై శ్రీశాంత్ ఫైర్

Sreesanth lashes out at Robin Uthappa on criticism of his catching

తిరువనంతపురం: 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ మిస్బాఉల్‌ హక్‌ ఇచ్చిన క్యాచ్‌ పడతాడనుకోలేదని టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ రాబిన్‌ ఊతప్ప చేసిన వ్యాఖ్యలపై శ్రీశాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు ఊతప్ప తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఎన్ని క్యాచ్‌లు పట్టాడో కూడా తనకు తెలియదని, కానీ కేరళ తరఫున ఆడుతున్న అతను చాలా క్యాచ్‌లు చేజార్చడని విన్నానని కౌంటర్ ఇచ్చాడు. బుధవారం హలో యాప్ లైవ్ సెషన్‌లో మాట్లాడిన శ్రీశాంత్.. ఊతప్పపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.

రాసిపెట్టి ఉండటం వల్లే టీ20 ప్రపంచకప్..

రాసిపెట్టి ఉండటం వల్లే టీ20 ప్రపంచకప్..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఊతప్ప 2007 ప్రపంచకప్ ఫైనల్ నాటి ఉత్కంఠను వివరించాడు. ‘జోగిందర్ ఫైనల్ ఓవర్ వేసేటప్పుడు నేను లాంగ్ ఆన్‌లో ఉన్నా. తొలి బంతి వైడ్‌గా వెళ్లడంతో నిరాశా చెందా. తర్వాతి బంతి సిక్స్ వెళ్లకుండా ఉంటే చాలనుకున్నా. కానీ అది సిక్స్ పడింది. అయినా భారత్ గెలుస్తుందనే ఆశలు ఉన్నాయి. మూడో బంతికి మిస్బా స్కూప్ షాట్ ఆడాడు. అది ఆమాంతం గాల్లోకి వెళ్లడం చూసి వెంటనే అక్కడ ఎవరు ఫీల్డింగ్ చేస్తున్నారని గమనించా.

శ్రీశాంత్ కనపడ్డాడు. అప్పటికే అతనంటే క్యాచ్‌లు వదిలేశేవాడని పేరుంది. శ్రీశాంత్ తేలిక క్యాచ్‌లు కూడా వదిలేయడం చాలా సార్లు చూశాను. అతను ఒక్క క్యాచ్ పట్టేలా చూడు దేవుడా అని ప్రార్థించా. అతను పట్టిన క్యాచ్‌ను మీరు గమనిస్తే.. బంతి చేతుల్లో పడ్డాక కూడా గాల్లోకే చూస్తుంటాడు. కాబట్టి.. నేనైతే రాసిపెట్టి ఉండటం వల్లే ఆ ప్రపంచకప్ గెలిచామని భావిస్తా'అని తెలిపాడు.

నా బౌలింగ్‌లో క్యాచ్ వదిలిస్తే చెప్తా..

నా బౌలింగ్‌లో క్యాచ్ వదిలిస్తే చెప్తా..

అయితే ఈ వ్యాఖ్యలను ఓ అభిమాని శ్రీశాంత్ ముందు ప్రస్తావించగా.. ఊతప్పనే ఎక్కువ క్యాచ్‌లు వదిలేస్తాడని మండిపడ్డాడు. ‘ఊతప్ప తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఎన్ని క్యాచ్‌లు పట్టాడో నాకు తెలియదు. కానీ డొమెస్టిక్ క్రికెట్‌లో లాస్ట్ సీజన్ అతను కేరళ‌కు ఆడాడు. అతను చాలా క్యాచ్‌లు వదిలేశాడని తెలిసింది. త్వరలోనే నేను కేరళ జట్టు తరఫున బరిలోకి దిగుతున్నా. అతనికి చెప్పాలనుకుంటున్నది ఒక్కటే.. దయచేసి నా బౌలింగ్‌లో క్యాచ్‌లు చేజార్చవద్దు. జట్టులో ఉన్న వారు నీకన్నా జూనియర్స్ కావడంతో ఊతప్ప క్యాచ్‌లు వదిలేసినా ఏం అనలేదు. కానీ నా బౌలింగ్‌లో చేజార్చితే నేనేం చేస్తానో అతనికి బాగా తెలుసు'అని శ్రీశాంత్ ఘాటుగా వ్యాఖ్యానించాడు.

నన్ను పక్కనపెట్టారు.. ఇక నేను అమెరికాకు ఆడుతా : ఇంగ్లండ్ క్రికెటర్

నా ఓవరాల్ కెరీర్‌లో వదిలేసింది..

నా ఓవరాల్ కెరీర్‌లో వదిలేసింది..

‘ఇక తన ఎనిమిదేళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో కేవలం 4-5 క్యాచ్‌లు మాత్రమే వదిలేశాను. ఓవరాల్ ప్రొఫెషనల్ కెరీర్‌లో 10-15 సార్లు క్యాచ్‌లు చేజార్చి ఉంటాను. వరల్డ్ బెస్ట్ ఫీల్డర్ జాంటీ రోడ్స్ కూడా అప్పుడప్పుడు క్యాచ్ చేజారుస్తాడు'అని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. ఆశ్చర్యకరంగా త్వరలోనే ఈ ఇద్దరు ఆటగాళ్లు కేరళ తరఫున బరిలోకి దిగనున్నారు. బీసీసీఐ విధించిన నిషేధంతో ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగుస్తుండటంతో శ్రీశాంత్ రీ ఎంట్రీ కోసం తహతహలాడుతున్నాడు.

ఈ నేపథ్యంలోనే తన స్టేట్ టీమ్ కేరళ తరపున బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. మరోవైపు గత రంజీ సీజన్ 2019-20లోనే ఊతప్ప సౌరాష్ట్ర నుంచి కేరళకు మారాడు. వచ్చే సీజన్‌లో కూడా అతను కేరళకే ఆడనున్నాడు.

వర్ణ వివక్షకు మేమూ బాధితులమే: భారత క్రికెటర్లు

Story first published: Thursday, June 4, 2020, 15:59 [IST]
Other articles published on Jun 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X