Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నన్ను పక్కనపెట్టారు.. ఇక నేను అమెరికాకు ఆడుతా : ఇంగ్లండ్ క్రికెటర్

England Pacer Liam Plunkett says he would consider playing for US in future

లండన్‌: జాతీయ శిక్షణ శిబిరం కోసం ప్రకటించిన 55 మంది క్రికెటర్ల జాబితాలో తన పేరు లేకపోవడంపై ఇంగ్లండ్ పేసర్ లియామ్ ప్లంకెట్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తనకు కనీస సమాచారం ఇవ్వలేదని ఈ ఇంగ్లండ్‌ వన్డే వరల్డ్‌కప్‌ జట్టు సభ్యుడు చెప్పుకొచ్చాడు. ట్రైనింగ్ క్యాంప్ జాబితాలో తన పేరు లేని విషయాన్ని ప్లంకెట్‌ ట్విట్టర్‌ ద్వారా తెలుసుకున్నాడు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ప్లంకెట్ ఒకవేళ ఏదైనా అవకాశముంటే అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు తాను సిద్ధమని ప్రకటించాడు. 'నా భార్య అమెరికన్‌. అక్కడ అత్యున్నత స్థాయిలో క్రికెట్‌ ఆడే అవకాశముంటే నేను సిద్ధమే. ఇంగ్లండ్‌లో చేయడానికి ఏం లేనప్పుడు అమెరికాకు ఎందుకు ఆడకూడదు?'అని ప్లంకెట్‌ ప్రశ్నించాడు.

ఇక వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత నిలకడలేమి ఫామ్‌తో ఇంగ్లండ్‌ జట్టులో చోటు కోల్పోయిన ఇంగ్లండ్ పేసర్‌ లియామ్‌ ప్లంకెట్‌కు ఆ జట్టు మాజీ కెప్టెన్‌ మైకెల్‌ వాన్‌ మద్దతుగా నిలిచాడు. అతనికి చెప్పకుండా ట్రైనింగ్ క్యాంప్ జాబితా నుంచి అతని పేరు ఎలా తీసేస్తారని ప్రశ్నించాడు. 'ఈ ట్రైనింగ్ జాబితాను రూపొందించే క్రమంలో ఎటువంటి వివక్ష చూపకుండా ఉండాలనే ప్రధాన సూత్రాన్ని సెలక్టర్లు మరిచారు. ఇంగ్లండ్‌ వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న ప్లంకెట్‌పై ఎందుకు అంతటి వివక్ష ?. సమాచారం ఇవ్వకుండా అతన్ని పక్కన పెట్టడం అవమానించడమే. ఆలస్యంగా తెలుసుకున్న ఈ వార్త నన్ను నిరాశకు గురి చేసింది.'అని మైకేల్ వాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Story first published: Thursday, June 4, 2020, 10:22 [IST]
Other articles published on Jun 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+