న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టిన తర్వాత స్టువర్ట్ బ్రాడ్ తండ్రి యూవీతో ఏమన్నాడంటే.?

Yuvraj Singh reveals what Stuart Broads father told him after 6 sixes

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 2007 టీ20 ప్రపంచకప్‌లో 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆ జట్టు పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యూవీ ఈ అరుదైన ఫీట్‌ను నెలకొల్పాడు. వాస్తవానికి ఇంగ్లండ్ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో మైదానంలో నెలకొన్న గొడవ.. యువరాజ్‌ను 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టేలా పురికొల్పింది. ఈ విషయాన్ని ఇటీవలే ఈ సిక్సర్ల సింగ్ కూడా అంగీకరించాడు. ఫ్లింటాఫ్ మాటలే తనను విధ్వంసకరంగా ఆడేలా చేశాయన్నాడు. అయితే యూవీ విధ్వంసంతో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న అపఖ్యాతిని బ్రాడ్ మూటగట్టుకున్నాడు. దీంతో అతని కెరీర్ ముగిసినట్లేనని అందరూ భావించారు.

నా కొడుకు కెరీర్ ముగించేసావ్...

నా కొడుకు కెరీర్ ముగించేసావ్...

ఆఖరికి అతని తండ్రి క్రిస్ బ్రాడ్ కూడా యువరాజ్ దగ్గరకు వచ్చి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడంట! అవును ఈ విషయాన్ని తాజాగా యూవీనే చెప్పాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ అయిన క్రిస్ బ్రాడ్.. ఆ దేశం తరఫున 25 టెస్ట్‌లు, 35 వన్డేలు ఆడాడు. నాటి ప్రపంచకప్ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించాడు. తాజాగా యువీ బీబీసీతో మాట్లాడుతూ.. ఆ సిక్సర్ల విధ్వంస తర్వాత క్రిస్ బ్రాడ్ తన దగ్గరకు వచ్చి అన్న మాటలను గుర్తు చేసుకున్నాడు.

‘స్టువర్ట్ బ్రాడ్ తండ్రి క్రిస్ బ్రాడ్.. మ్యాచ్ రిఫరీ. ఈ సిక్సర్ల విధ్వంసం మరుసటి రోజు నా దగ్గరకు వచ్చి.. ‘దాదాపు.. నా కొడుకు కెరీర్‌ను ముగించేసావు.. కనీసం అతని కోసం ఓ షర్ట్‌పై సంతకమన్నా చేసివ్వు'అన్నాడు. నేను వెంటనే నా భారత జెర్సీపై ‘నా బౌలింగ్‌లో కూడా 5 సిక్సర్లు బాదారు. ఆ నొప్పేంటో నాకు బాగా తెలుసు. ఇంగ్లండ్ క్రికెట్ భవిష్యత్తుకు ఆల్‌ది బెస్ట్'అనే సందేశం రాసిచ్చాను. ప్రస్తుతం అతను ప్రపంచంలోనే ఓ గొప్ప బౌలర్‌గా నిలిచాడు. ఇక ఏ భారత బౌలర్ అలా 6 బంతుల్లో 6 సిక్స్‌లు సమర్పించుకుంటారనుకోను'అని యూవీ చెప్పుకొచ్చాడు. ఇక యూవీ బౌలింగ్‌లో ఇంగ్లండ్‌కే చెందిన ఆల్‌రౌండర్ దిమిత్రీ మస్కెరెనాస్ (0,6,6,6,6,6) వరుస బంతుల్లో ఐదు సిక్స్‌లు బాదాడు.

భారత్ విజయం..

భారత్ విజయం..

ఇక ఆ మ్యాచ్ 19వ ఓవర్‌లో ఫ్లింటాఫ్‌పై కోపంతో 6 సిక్స్‌లు బాదడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 218 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ లక్ష్యాన్ని అందుకోలేక 18 పరుగులతో ఓడింది. ఇక ఆ అరంగేట్ర టీ20 ప్రపంచకప్‌ను మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దాయదీ పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో భారత్ అద్బుత విజయాన్నందుకుంది.

బ్రాడ్ కెరీర్ సాఫీగా..

బ్రాడ్ కెరీర్ సాఫీగా..

ఇక బ్రాడ్ విషయానికొస్తే... ఆ మ్యాచ్ అనంతరం కూడా అతని కెరీర్ విజయవంతంగా సాగింది. కేవలం ఆటగాడిగానే కాకుండా 2012, 2014 ప్రపంచకప్‌‌లలో జట్టును కూడా నడిపించాడు. టెస్ట్‌ల్లో జేమ్స్ అండర్సన్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు. 138 టెస్ట్‌ల్లో 485 వికెట్లు తీశాడు. ఇక 121 వన్డేల్లో 178 వికెట్లు, 56 టీ20ల్లో 65 వికెట్లు తీశాడు.

ధోనీ కెరీర్ దూసుకుపోతే.. నాది పాతాళానికి పడిపోయింది: ఆర్పీ సింగ్

పీక కోస్తానని హెచ్చరించడంతోనే..

పీక కోస్తానని హెచ్చరించడంతోనే..

ఇటీవలే నాటి మ్యాచ్‌లో ఫ్లింటాఫ్‌తో చోటు చేసుకున్న గొడవ గురించి యూవీ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఫ్లింటాఫ్ మాటలు తనకి కోపం తెప్పించాయని వెల్లడించిన యూవీ.. హిట్టింగ్‌తోనే అతనికి బదులివ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.

‘నిజాయతీగా చెప్పాలంటే నా మైండ్‌లో ఆరు సిక్సర్లు కొట్టాలనే ఆలోచన లేదు. కానీ.. ఫ్లింటాఫ్‌తో గొడవ నన్ను హిట్టింగ్‌కు పురిగొల్పింది. అంతక ముందు ఓవర్‌లో ఫ్లింటాఫ్‌ బౌలింగ్‌లో రెండు బౌండరీలు కొట్టాను. దాంతో అసహనానికి గురైన అతను మరో ఎండ్‌కు నడుచుకుంటు వెళ్తున్న నాపై నోరుపారేసుకున్నాడు. అప్పుడు అతను ఏం అన్నాడో అనేది మాత్రం సరిగ్గా చెప్పలను. కానీ నేను రెండు పేలవ షాట్లు ఆడాను అని మాత్రం చెప్పాడు. నేను కూడా ఏ అంటున్నావని బదులివ్వడంతో మా ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.

Story first published: Sunday, April 26, 2020, 18:28 [IST]
Other articles published on Apr 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X