
ఎప్పుడూ అదే చెప్పేవాడు..
ఇదే అంశంపై బ్రెట్‌లీ ఇటీవల స్టార్‌స్పోర్ట్స్ ఛానల్‌లో 'క్రికెట్ కనెక్టెడ్' కార్యక్రమంలో మాట్లాడుతూ .. తన కెరీర్ ప్రారంభం నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. ‘మా జట్టులో ఎప్పుడూ ఒక బౌలింగ్ కెప్టెన్ ఉండేవాడు. నేను జట్టులోకి వచ్చినప్పుడు గ్లెన్ మెక్‌గ్రాత్ మా బౌలింగ్ సారథి. అతనెప్పుడూ యువ బౌలర్లకు ఒకే విషయం చెప్పేవాడు. అది మిచెల్ జాన్సన్ అయినా, మరెవరైనా.. టీమిండియా బ్యాట్స్‌మన్ సచిన్‌ను కవ్వించవద్దని, ఒకవేళ అతన్ని కవ్విస్తే మాత్రం ఆరోజు ఆ బౌలర్ బాధపడక తప్పదని హెచ్చరించేవాడు. మా బౌలింగ్ సమావేశాల్లోనూ ఇదే చర్చకువచ్చేది' అని బ్రెట్‌లీ చెప్పుకొచ్చాడు.

స్లెడ్జింగ్ చేయకపోవడానికి కారణం ఇదే..
ఈ కారణంతోనే తమ జట్టు ఎప్పుడూ సచిన్‌ను స్లెడ్జింగ్ చేయకపోయేదని బ్రెట్ లీ వెల్లడించాడు. క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్‌బ్లాస్టర్ తన కెరీర్‌లో ఆసీస్‌పై ఎన్నోసార్లు ఆధిపత్యం చెలాయించాడు. మెక్‌గ్రాత్, షేన్‌వార్న్, బ్రెట్‌లీ లాంటి దిగ్గజాలను సైతం ఉతికారేసిన సంగతి తెలిసిందే. ఇక ఆస్ట్రేలియాపై 39 టెస్టులు ఆడిన టెండూల్కర్ 11 శతకాలతో పాటు ఒక డబుల్ సెంచరీ చేశాడు. మరోవైపు వన్డేల్లో 71 మ్యాచ్‌లాడి 9 శతకాలతో 3077 పరుగులు చేశాడు.

ఆ రోజు చాలా బాధపడ్డా..
ఇదిలా ఉండగా, పాక్ మాజీ బౌలర్ సక్లెయిన్ ముస్తక్ సైతం ఇటీవల మాట్లాడుతూ సచిన్‌ను స్లెడ్జింగ్ చేసి బాధపడ్డానని చెప్పాడు. తాను అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన తొలినాళ్లలో లిటిల్‌మాస్టర్‌ను స్లెడ్జింగ్ చేశానని చెప్పాడు. తర్వాత సచిన్ తన వద్దకు వచ్చి 'నేను నీతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించ లేదు. మరి నువ్వెందుకు నాతో అలా చేస్తున్నావ్?' అని అడిగాడని ముస్తక్ చెప్పాడు. దాంతో తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందని పాక్ మాజీ బౌలర్ నాటి సంగతుల్ని గుర్తుచేసుకున్నాడు. ఆ మ్యాచ్ అనంతరం సచిన్‌కు క్షమాపణలు కూడా చెప్పినట్లు సక్లెయిన్ తెలిపాడు.
6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టిన తర్వాత స్టువర్ట్ బ్రాడ్ తండ్రి యూవీతో ఏమన్నాడంటే

కోహ్లీకే సాధ్యం..
ఇక సచిన్ టెండూల్కర్ వంద సెంచరీల రికార్డును మరో 7-8 ఏళ్లలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అధిగమిస్తాడని బ్రెట్ లీ జోస్యం చెప్పాడు. తన నైపుణ్యం, ఫిట్‌నెస్, మానసిక బలంతో కోహ్లీ ఎలాంటి రికార్డులనైనా బద్దలు కొడతాడన్నాడు. 'ఒకప్పుడు సచిన్‌లో ఉన్న లక్షణాలు ఇప్పుడు కోహ్లీలో కనిపిస్తున్నాయి. విరాట్‌కు నైపుణ్యంతో పాటు ఫిట్‌నెస్ సొంతం.
ఇక తన మానసిక బలంతో కఠిన మ్యాచ్‌ల్లో, విదేశాల్లోనూ రాణిస్తున్నాడు. కానీ సచిన్‌ని దాటి వెళ్లే సత్తా ఎవరికి లేదు. ఆయన క్రికెట్‌కి దేవుడు. మనం ఎదురుచూడటం తప్ప ఏం చేయలేము. కానీ ఇప్పుడు ఉన్న ఫామ్‌లో కోహ్లీ ఉంటే.. మరో 7-8 ఏళ్లలో వంద సెంచరీల రికార్డునుసాధించగలడు' అని బ్రెట్ లీ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications












