న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సర్ఫరాజ్ ఖాన్ దండయాత్ర: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో మరో ట్రిపుల్‌ దిశగా..

Ranji Trophy: Sarfaraz Khan follows up triple hundred with 199-ball double vs Himachal

ముంబై : ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో ముంబై ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ దండయాత్ర కొనసాగుతోంది. అతని నిర్ధాక్షిణ్యమైన బ్యాటింగ్‌కు బౌలర్లు బలవుతూనే ఉన్నారు. ప్రత్యర్థి మారినా.. వేదిక ఏదైనా అతని విధ్వంసం మాత్రం మారడంలేదు. బౌండరీల మోత ఆగడం లేదు. మొన్న అజేయ ట్రిపుల్ సెంచరీతో ఉత్తర ప్రదేశ్ బౌలర్లను చీల్చి చిండాడని సర్ఫరాజ్ ఖాన్.. నేడు హిమాచల్ బౌలర్లను ఉతికారేశాడు.

 ఫాస్టెస్ట్ డబుల్..

ఫాస్టెస్ట్ డబుల్..

సోమవారం ధర్మశాల మైదానం వేదికగా హిమాచల్ ప్రదేశ్‌తో ప్రారంభమైన మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన సర్ఫరాజ్ ఖాన్ (213 బంతుల్లో 32 ఫోర్లు, 4 సిక్సర్లతో 226 బ్యాటింగ్) వీర విహారం చేశాడు. 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును అద్భుత డబుల్ సెంచరీతో గట్టెక్కించాడు. 199 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసుకొని మరో ట్రిపుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు.

అది ఎల్బీడబ్ల్యూ కాదు.. ఎస్బీడబ్ల్యూ.. ఇప్పటికీ ఇండియన్ ఫ్యాన్స్ తిడుతూనే ఉంటారు !

 రెండో ఆటగాడిగా..

రెండో ఆటగాడిగా..

ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ, తర్వాత డబుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా సర్ఫరాజ్ ఖాన్ గుర్తింపు పొందాడు. అతని కన్నా ముందు తమిళనాడు ప్లేయర్ వీవీ రామన్ ఒక్కడే 1989లో 313, 200తో ఈ ఫీట్ సాధించాడు.

ముంబై 372/5

ముంబై 372/5

సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసానికి తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 75 ఓవర్లలో 5 వికెట్లకు 372 పరుగులు చేసింది. క్రీజులో సర్ఫరాజ్‌తో సహా శుభమ్ రంజేన్(75 బంతుల్లో 7 ఫోర్లు 44 బ్యాటింగ్) ఉన్నాడు. ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి హిమాచల్ ప్రదేశ్ బౌలర్లు షాకిచ్చారు. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి ముంబై 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట స్థితిలో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ తన గత మ్యాచ్ ఫామ్‌ను కొనసాగిస్తూ చెలరేగాడు. సిద్ధేష్ లాడ్(20) ఔటైనా.. కెప్టెన్ ఆధిత్య తారే(62)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అతనితో కలిసి ఐదో వికెట్‌కు 143 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. బ్యాడ్ లైట్ కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను త్వరగా నిలిపివేయగా.. సర్ఫరాజ్ క్రీజులో ఉన్న శుభమ్ రంజేన్‌తో కలిసి 158 పరుగులు జోడించాడు. సర్ఫరాజ్ ఖాన్ ధాటికి ప్రత్యర్థి బౌలర్లు పోటాపోటిగా పరుగులు సమర్పించుకున్నారు.

మళ్లీ రవీంద్ర జడేజా Vs మంజ్రేకర్.. కానీ ఈసారి

ట్రిపుల్‌తో దిగ్గజాల సరసన..

ట్రిపుల్‌తో దిగ్గజాల సరసన..

గత మ్యాచ్‌లో సాధించిన అజేయ ట్రిపుల్ సెంచరీతో సర్ఫరాజ్ ఖాన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ముంబై తరఫున ఈ ఘనతనందుకున్న ఏడో బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. సునీల్ గావస్కర్, సంజయ్ మంజ్రేకర్, వసీం జాఫర్, రోహిత్ శర్మ, విజయ్ మర్చంట్, అజిత్ వాడెకర్ సర్ఫరాజ్ ఖాన్ కన్నా ముందు ముంబై తరఫున ట్రిపుల్ సెంచరీలు సాధించారు. సర్ఫరాజ్ ట్రిపుల్ సెంచరీ ఓవరాల్‌గా ముంబై తరఫున 8వది కాగా.. వసీం జాఫర్ రెండు సార్లు ఈ ఫీట్ అందుకున్నాడు. చివరికి ఈ మ్యాచ్‌ డ్రాగా ముగియగా.. కెరీర్‌లో సర్ఫరాజ్ ఖాన్ ( 391 బంతుల్లో 30 ఫోర్లు, 8 సిక్సర్లతో 301 నాటౌట్) ఇదే అత్యుత్తమ స్కోరుగా నిలిచింది.

Story first published: Monday, January 27, 2020, 20:38 [IST]
Other articles published on Jan 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X