For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సైక్లింగ్ యాత్ర.. 800 కిలోమీటర్లు..!

హైదరాబాద్: ఫిట్‌నెస్, సైక్లింగ్‌పై ప్రజల్లో అవగాహన కలిగించాలనే లక్ష్యంతో ప్ర‌ముఖ సైక్లిస్ట్‌, వెల్‌నెస్ అడ్వకేట్ కాంతి దత్ హైద‌రాబాద్ నుంచి ముంబైకి సైక్లింగ్ యాత్రను ప్రారంభించారు. మార్చి 7 నుంచి మార్చి 14 వరకు సుమారు 800 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్‌పై ప్రయాణిస్తూ 30 చోట్ల అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

ఫియర్ ప్రాజెక్ట్ పేరిట‌, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్‌) సహకారంతో ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో జరిగిన ప్రారంభ‌ కార్యక్రమంలో పలువురు అతిథులు, ఫిట్‌నెస్ ప్రేమికులు, ప్రముఖులు పాల్గొని కాంతి దత్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంత‌రం అక్క‌డ నుంచే సైక్లింగ్ యాత్రను ప్రారంభించారు.

మొత్తం ఎనిమిది రోజుల పాటు సాగనున్న ఈ ప్రయాణంలో దాదాపు 800 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ సుమారు 30 ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ యాత్రలో భాగంగా పలు పాఠశాలలు, కళాశాలలను సందర్శించి విద్యార్థులతో సమావేశ‌మై ఫిట్‌నెస్ ప్రాముఖ్యత, సైక్లింగ్ ప్రయోజనాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి అవగాహన కల్పించనున్నారు.

Fit India Ambassador Kanthi Dutt Embarks on 800km Hyderabad-to-Mumbai Cycling Expedition to Promote Wellness

ఈ సందర్భంగా కాంతి దత్ మాట్లాడుతూ..'మార్చి 7 నుంచి మార్చి 14 వరకు హైదరాబాద్ నుంచి ముంబై వరకు సైకిల్‌పై ప్రయాణం చేయబోతున్నాను. నోవాటెల్‌లో పలువురు అతిథుల సమక్షంలో ఈ యాత్రను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఎనిమిది రోజుల ప్రయాణంలో పలు స్కూళ్లు, కాలేజీలను సందర్శిస్తూ విద్యార్థులకు ఫిట్‌నెస్, సైక్లింగ్ గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాను. సైక్లింగ్ వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మనసుకు ప్రశాంతత కూడా కలుగుతుంది. ఈ సందేశాన్ని ఎక్కువ మందికి చేరవేయడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశ్యం'అని తెలిపారు.

సైక్లింగ్‌ను రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, యువతలో ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెంపొందించాల‌నేది ఈ సైక్లింగ్ యాత్ర ల‌క్ష్య‌మ‌ని కాంతి దత్ తెలిపారు. అలాగే పర్యావరణానికి అనుకూలమైన రవాణా విధానంగా సైక్లింగ్‌ను ప్రోత్సహించడం కూడా ఈ యాత్ర ముఖ్య లక్ష్యాల్లో ఒకటిగా కాంతి పేర్కొన్నారు.

Story first published: Tuesday, March 10, 2026, 11:13 [IST]
Other articles published on Mar 10, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+