న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అది ఎల్బీడబ్ల్యూ కాదు.. ఎస్బీడబ్ల్యూ.. ఇప్పటికీ ఇండియన్ ఫ్యాన్స్ తిడుతూనే ఉంటారు !

Glenn McGrath recalls getting Sachin Tendulkar lbw off a bouncer


సిడ్నీ : టీమిండియా లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ మధ్య పోరంటే యావత్ క్రికెట్ అభిమానులకు ఆసక్తికరమే. ఆస్ట్రేలియా-భారత్ మధ్య మ్యాచ్ అంటే గుర్తుచ్చే విషయం కూడా ఇదే. సచిన్-మెక్‌గ్రాత్, సచిన్-షేన్ వార్న్ మధ్య పోరు అభిమానులకు కావాల్సిన మజానిచ్చేది. కొన్నిసార్లు వీరి బౌలింగ్ సచిన్ చీల్చి చెండాడితే.. మరికొన్ని సార్లు వీరి అద్భుత బంతులకు మాస్టర్ వెనుదిరిగాడు.

మళ్లీ రవీంద్ర జడేజా Vs మంజ్రేకర్.. కానీ ఈసారిమళ్లీ రవీంద్ర జడేజా Vs మంజ్రేకర్.. కానీ ఈసారి

ఇక సచిన్-మెక్‌గ్రాత్ మధ్య చోటుచేసుకున్న కొన్ని వివాదస్పద ఘటనలు ఎవరు మరిచిపోలేదు. ముఖ్యంగా 1999లో అడిలైడ్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో వివాదస్పద ఎల్బీడబ్ల్యూతో సచిన్ టెండూల్కర్ ఔటైన తీరు.. 2000 ఐసీసీ నాకౌట్ టోర్నీలో వీరి మధ్య చోటుచేసుకున్న స్లెడ్జింగ్.. 2003 ప్రపంచకప్ ఫైనల్లో మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో సచిన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరగడం అభిమానుల మదిలో అలా నిలిచిపోయాయి.

అయితే ఎల్బీడబ్ల్యూ వివాదస్పద ఘటనపై ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న మెక్‌గ్రాత్ స్పందించాడు. ఆనాటి క్షణాలను గుర్తుచేసుకుంటూ.. ఆరోజు అసలేం జరిగిందో తెలిపాడు.

Glenn McGrath recalls getting Sachin Tendulkar lbw off a bouncer

'సచిన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అప్పటికి అతను అంతగా పరుగులేం చేయలేదనుకుంటా. లేక జీరో వద్దనో ఉన్నాడు. నేను అతనికి బౌన్సర్ వేసాను. అయితే ఆ బంతి అనూహ్యంగా లో బౌన్సర్‌గా వెళ్లింది. అయితే సచిన్ ఎప్పటిలా బంతి బౌన్స్ అవుతుందేమోనని కిందికి వంగాడు. అతను పొట్టిగా ఉండటంతో బంతి కాస్త అతని భుజానికి తాకింది. నాకెందుకో ఆ బంతి మిడిల్ స్టంప్‌ దిశగా దూసుకెళ్లినట్లు కనిపించింది. వెంటనే నేను అప్పీల్ చేశా. అంపైర్ డారిల్ హర్పర్ ఔటిచ్చాడు. దీంతో సచిన్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ క్రీజు వీడటానికి ఇష్టపడలేదు. వాస్తవానికి అది ఎల్బీ డబ్ల్యూ కాదు.. షోల్డర్ బిఫోర్ వికెట్ (ఎస్‌బీడబ్ల్యూ).'అని మెక్‌గ్రాత్ తెలిపాడు. అయితే సచిన్‌ను కలిసిన ప్రతీసారి ఈ వివాదస్పద ఔట్‌ను తనకు గుర్తు చేస్తూనే ఉంటాడన్నాడు.

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంతే : పాంటింగ్టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంతే : పాంటింగ్

అయితే ఈ వివాదస్పద ఔట్ పట్ల ఇండియన్ ఫ్యాన్స్ ఇప్పటికీ ఆగ్రహంగానే ఉన్నారని ఈ ఆస్ట్రేలియా స్టార్ చెప్పుకొచ్చాడు. ఈ ఘటన అనంతరం తాను చాలా సార్లు స్లెడ్జ్‌కు గురయ్యానని, ముఖ్యంగా సచిన్ ఫ్యాన్స్ పదేపదే ఈ విషయాన్ని ప్రస్తావించేవారని మెక్‌గ్రాత్ గుర్తుచేసుకున్నాడు. కానీ ఇది ఆట పట్ల వారికున్న పిచ్చని, ముఖ్యంగా సచిన్‌పై ఉన్న ప్రేమని మెక్‌గ్రాత్ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, January 27, 2020, 16:43 [IST]
Other articles published on Jan 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X