న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎగతాళి చేసిన పాక్ ఫ్యాన్సే నిలబడి చప్పట్లతో అభినందించారు: ధావన్

Pakistan fans had taunted Shikhar Dhawan just before the 2015 World Cup match began

న్యూఢిల్లీ: చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ అంటేనే యుద్ధంలాంటి వాతావరణం నెలకొంటుంది. ఇరు దేశాల అభిమానులే కాకుండా యావత్‌ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా చూస్తోంది. మ్యాచ్ ఎక్కడ జరిగినా ఇరు జట్ల ఫ్యాన్స్‌తో మైదానం కిక్కిరిసిపోతుంది. ఇక ఆ పోరు ప్రపంచకప్ లాంటి వేదికగా జరిగితే.. మరింత రసవత్తరంగా ఉంటుంది. కోట్లాది మంది అభిమానుల ఆశలతో బరిలోకి దిగే ఇరు జట్లు ఆటగాళ్లపై కూడా అంతే స్థాయి ఒత్తిడి నెలకొంటుంది. తాజాగా భారత్-పాక్ మ్యాచ్ పరిస్థితులు, ఆటగాళ్లపై నెలకొనే ఒత్తిడి గురించి టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తెలిపాడు.

అదో విచిత్రమైన ఫీలింగ్..

అదో విచిత్రమైన ఫీలింగ్..

భారత మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ సోషల్ మీడియా వేదికగా నిర్వహిస్తున్న డబుల్ ట్రబుల్ షోలో ధావన్ పాల్గొన్నాడు. 2015 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ క్షణాలను గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్ పరిస్థితులు తనను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాయని చెప్పుకొచ్చాడు. ‘2015 ప్రపంచకప్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ నాకింకా గుర్తుకుంది. ఆ సమయంలో నా ఫామ్ కూడా సరిగ్గాలేదు. మెగాటోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యా. పాక్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో నేను చాలా ఒత్తిడికి గురయ్యాను. మైదానంలో నెలకొన్న వాతావరణంతో ఓ వింత ఫిలింగ్ కలిగింది.'అని తెలిపాడు.

ఆ ముగ్గురికి బౌలింగ్ చేయడం చాలా కష్టం: బ్రెట్ లీ

15 పరుగులు చేయనన్నారు..

15 పరుగులు చేయనన్నారు..

ఇక తాను బ్యాటింగ్ వెళ్తున్న సమయంలో పాకిస్థాన్‌కు చెందిన అభిమానులు ఎగతాళి చేశారని, 15 పరుగుల కంటే ఎక్కువ చేయడని కామెంట్ చేశారని ధావన్ గుర్తు చేసుకున్నాడు. ‘ఆ ప్రపంచకప్‌లో మా తొలి మ్యాచ్ పాకిస్థాన్‌తోనే. టాస్ గెలిచిన ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక నేను మైదానంలోకి వెళ్తుండగా పాక్ అభిమానులు నన్ను ఎగతాళి చేస్తూ బిగ్గరగా అరించారు. 15 పరుగులు కంటే ఎక్కువ చేయడని కామెంట్ చేశారు.

నేను ఓకే అన్నట్లు తలూపుకుంటూ బ్యాటింగ్ వెళ్లాను. తీరా 76 బంతుల్లో 73 పరుగులు చేసి పెవిలియన్‌కు వస్తున్న క్రమంలో ఎగతాళిగా కామెంట్ చేసిన అభిమానులే నిలబడి చప్పట్లు కొట్టారు. ఇక భారత అభిమానులు మాత్రం ఏం జరిగినా ప్రపంచకప్‌ టోర్నీల్లో భారతే గెలవాలనుకుంటారు. స్టాండ్స్‌లో కూర్చోని ప్రార్ధనలు కూడా చేస్తారు.'అని ధావన్ చెప్పుకొచ్చాడు.

భారత్‌కు భారీ విజయం..

భారత్‌కు భారీ విజయం..

ఇక ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 300 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(107) సెంచరీతో చెలరేగగా.. సురేశ్ రైనా(74), శిఖర్ ధావన్(73) పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన పాకిస్థాన్.. 47 ఓవర్లలో 224 పరుగులకే కుప్పకూలి 76 పరుగులు ఘోర పరాజయాన్ని చవిచూసింది. మహ్మద్ షమీ(4/35), మోహిత్ శర్మ(2/35), ఉమేశ్ యాదవ్(2/50)‌లు పాక్ పతనాన్ని శాసించారు. ఇక ఆ టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళ్లిన భారత్ సెమీఫైనల్లో ఆతిథ్య ఆస్ట్రేలియా చేతిలో 95 పరుగులతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

పాక్‌పై భారత్‌కు తిరుగులేదు..

ప్రపంచకప్ టోర్నీల్లో దాయదీ పాకిస్థాన్‌పై భారత్‌కు తిరుగులేదు. వన్డే అయినా టీ20 వరల్డ్‌కప్ అయినా ఇప్పటి వరకు భారతే విజయం సాధించింది. 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఇరు జట్లు ఏడు సార్లు తలపడగా.. ఈ ఏడుసార్లు భారతే విజయం సాధించింది. ఇక టీ20 వరల్డ్‌కప్‌లో ఇరుజట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు జరగ్గా.. ఈ నాలుగు టీమిండియానే గెలిచింది.

ఖబర్దార్ అఫ్రిది.. ఇది సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన మోదీ ప్రభుత్వం

Story first published: Thursday, May 28, 2020, 19:18 [IST]
Other articles published on May 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X